జాతీయ వార్తలు

తక్షణమే నీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశానికి 2016-17 విద్యా సంవత్సరానికి ఒకే ఉమ్మడి ఎంట్రన్స్ పరీక్ష ‘నీట్’ను రెండు దశలుగా నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. దాదాపు ఆరున్నర లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్షకు హాజరు అవుతారని భావిస్తున్నారు. మే 1న జరిపే ఆలిండియా ప్రీ మెడికల్ టెస్ట్ (ఎఐపిఎంటి)ని నీట్-1గా పరిగణించడానికి, ఏఐపిఎంటికోసం దరఖాస్తు చేసుకోని వారికోసం జూలై 24న జరిపే నీట్-2కు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వడానికి, రెండు పరీక్షలకు కలిపి ఒకేసారి ఫలితాలను ఆగస్టు 17న ప్రకటించడానికి, మొత్తం అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 30 నాటికల్లా పూర్తి చేయడానికి కేంద్రం, సిబిఎస్‌ఇ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసి) సమర్పించిన షెడ్యూల్‌కు కోర్టు ఆమోదం తెలిపింది. ఈ ఉత్తర్వు నీట్ కిందికి వచ్చే అన్ని ప్రభుత్వ కాలేజీలు, డీమ్డ్ యూనివర్శిటీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు వర్తిస్తుందని, ఇప్పటికే జరిగిన లేదా వేరుగా నిర్వహించబడే ఎంట్రన్స్ పరీక్షలన్నీ రద్దవుతాయని కోర్టు స్పష్టం చేసింది.
నీట్‌ను తమపై రుద్దడానికి వీలులేదని, దాన్ని నిర్వహించలేమంటూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్నాటక మెడికల్ కాలేజీల అసోసియేషన్, సిఎంసి వెల్లూరులాంటి మైనారిటీ విద్యాసంస్థలు చేసిన వాదనలను తోసిపుచ్చిన తర్వాత కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నీట్ నిర్వహణపై ఇప్పటివరకు ఉన్న అనిశ్చితి పూర్తిగా తొలగిపోయినట్లయింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ వ్యవహారంపై దాఖలయ్యే ఏ సవాలయినా నేరుగా సుప్రీంకోర్టు ముందుకే రావాలని, ఏ హైకోర్టు కూడా జోక్యం చేసుకోవడానికి వీలులేదని 2010 డిసెంబర్ 21న కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సైతం ఈ తీర్పు పునరుద్ధరించింది. ఏప్రిల్ 11న జారీ చేసిన ఉత్తర్వులను తాను వెనక్కి తీసుకున్నందున ఒకే ఎంట్రన్స్ పరీక్ష నీట్ నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు లేవని కోర్టు అభిప్రాయపడింది. ‘ప్రతివాదులు (కేంద్రం, సిబిఎస్‌ఇ, ఎంసిఐ) తరఫున సమర్పించిన షెడ్యూల్ దృష్ట్యా ప్రతివాదులు పేర్కొన్న విధంగా నీట్‌ను నిర్వహించాలి. అంతేకాకుండా నీట్ నిర్వహించక పోవడానికి సంబంధించి ఇంతకుముందు ఏదయినా కోర్టు ఇచ్చిన తీర్పు స్థానంలో ఈ ఉత్తర్వు వర్తిస్తుంది. అందువల్ల ఈ దశలో కొత్తగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదు’ అని న్యాయమూర్తులు ఎఆర్ దవే, శివకీర్తి సింగ్, ఎకె గోయల్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నీట్‌ను రద్దు చేస్తూ 2013 జూలై 18న కోర్టు తీర్పు ఇచ్చిన దృష్ట్యా నీట్ నిర్వహించడం సబబు కాదన్న వాదనను బెంచ్ తోసిపుచ్చుతూ, 2016 ఏప్రిల్ 11 నాటి తీర్పుతో పైన పేర్కొన్న తీర్పును ఇదివరకే వెనక్కి తీసుకున్నారని, అందువల్ల 2010 డిసెంబర్ 10 తేదీతో జారీ అయిన నోటిఫికేషన్లు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని స్పష్టం చేసింది. ‘అయితే ఈ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల విచారణపై ఈ తీర్పు ప్రభావం ఏమీ ఉండదని కూడా స్పష్టం చేస్తున్నాం’ అని బెంచ్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకోసం ఒకే ఎంట్రన్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

నీట్ షెడ్యూల్

మొదటి విడత పరీక్ష - మే 1
రెండో విడత పరీక్ష - జూలై 24
ఫలితాల విడుదల - ఆగస్టు 17
కౌనె్సలింగ్ - సెప్టెంబర్ 30
నాటికి పూర్తి
తరగతుల ప్రారంభం - అక్టోబర్ 1