జాతీయ వార్తలు

ఆగ్రా సిహెచ్‌ఐలో బీఫ్ పార్టీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగ్రా, మార్చి 19: నగరంలోని కీంద్రీయ హిందీ విద్యా సంస్థ(సిహెచ్‌ఐ)లో ‘బీఫ్ పార్టీ’ జరిగినట్లుగా చూపించే ఫోటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం హిందుత్వ వాద గ్రూపులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడానికి దారి తీసింది. దీంతో అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించారు. సెంట్రల్ హిందీ ఇన్‌స్టిట్యూట్ హాస్టల్‌లో బీఫ్ పార్టీకి సంబంధించిన ఫోటోలు శుక్రవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన తర్వాత చేపట్టిన దర్యాప్తులో ప్రాథమికంగా అలాంటి పార్టీ ఏదీ జరిగినట్లుగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని సంస్థ అధికారులు చెప్పారు. ఈ వ్యవహారంపై వివరాలు తెలుసుకోవడం కోసం పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) రేఖా చౌహాన్ కూడా ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించారు. కాగా, ఈ సంఘటనపై బజరంగ్‌దళ్‌కు చెందిన కొంతమంది ఇన్‌స్టిట్యూట్ గేట్ల ముందర నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాగా, ప్రాథమిక దర్యాప్తులో సంస్థ ఆవరణలో అలాంటి పార్టీ జరిగినట్లు ఎలాంటి సాక్ష్యాధారమూ లభించలేదని సంస్థ రిజిస్ట్రార్ చంద్రకాంత్ త్రిపాఠీ చెప్పారు. కాగా, తమ హాస్టళ్లలో నాన్ వెజ్ ఆహారం సర్వ్ చేయరని కూడా మరో అధికారి తెలిపారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ వాఖ కింద ఉండే సెంట్రల్ హిందీ ఇన్‌స్టిట్యూట్‌లో హిందీ చదవడం కోసం అనేక దేశాలనుంచి విద్యార్థులు వస్తుంటారు.