జాతీయ వార్తలు

అనర్హులైన ఎమ్మెల్యేల పిటిషన్‌ను కొట్టివేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనితాల్, ఏప్రిల్ 23: ఉత్తరాఖండ్‌లో అనర్హత వేటుపడిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని రాష్ట్ర హైకోర్టును అసెంబ్లీ స్పీకర్ శనివారం కోరారు. ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని, అం దువల్ల వారు శిక్షార్హులని స్పీకర్ పేర్కొన్నారు.
తొమ్మిది మంది అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై శనివారం జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి యుసి ధ్యాని ఎదుట స్పీకర్ గోవింద్ సింగ్ కున్‌జ్వాల్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ ఎమ్మెల్యేలు బిజెపిలో ఎలా చేరుతారు? ఇలా చేరడం ద్వారా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను ఉల్లంఘించారని, అలాంటప్పుడు తమపై విధించిన అనర్హతను నిలిపివేయాలని ఎలా కోరుతారు? అని సిబ ల్ వాదించారు. పార్టీ ఫిరాయించడం ద్వారా రాజ్యాంగపరమైన నేరానికి పాల్పడినట్లు (ఉత్తరాఖండ్ హైకోర్టు) డివిజన్ బెంచ్ కూడా నిర్ధారించిందని సిబల్ గుర్తు చేశారు. ‘వారు బిజెపిలో చేరి, అసెంబ్లీలో డివిజన్ ఆఫ్ వోట్స్ కోసం మెమొరాండంపై సంతకం చేశారని, అది అనైతికం, రాజ్యాంగ వ్యతిరేకం అని వారికి తెలుసు’ అని సిబల్ పేర్కొన్నారు. బిజెపిలో చేరడంతో పాటు కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకంగా ద్రవ్యవినియోగ బిల్లుపై ఓటు వేశారని, ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో ఓటు వేశారని సిబల్ వాదించారు. స్పీకర్ తమకు పత్రాలు ఇవ్వలేదని వాదిస్తూ ఈ తొమ్మిది మంది న్యాయస్థానం ముందు అసత్యాలు చెప్పారని ఆయన పేర్కొన్నారు. పిటిషనర్లు (ఎమ్మెల్యేలు) తమ వద్ద ఉన్న కీలక సమాచారాన్ని కోర్టుకు వెల్లడించలేదని ఆయన అన్నారు. ఈ మూడు కారణాల ఆధారంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తమ అనర్హతను సవాలు చేస్తూ ఆర్టికల్ 226 కింద దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించాల్సిన అవసరం లేదని సిబల్ వాదించారు.
బిజెపి శిబిరంలో చేరిన తన ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తే అది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఎలా అవుతుందని కూడా సిబల్ ప్రశ్నించారు. ఇరు పక్షాలు అంగీకరించిన తేదీని నిర్ణయించినప్పటికీ తొమ్మిది మంది ఎమ్మెల్యేల తరపు సీనియర్ న్యాయవాది విచారణకు హాజరుకాకపోవడం పట్ల సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ తరపున సిబల్ వాదనలు ముగిసిన తరువాత న్యాయమూర్తి ధ్యాని ఈ కేసు విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు.