జాతీయ వార్తలు

ఊపిరి పీల్చుకున్న సర్కారు, బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పుతో కంగుతిన్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, బిజెపి అధినాయకత్వం శుక్రవారం హైకోర్టు తీర్పును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఊపిరి పీల్చుకున్నాయి. నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోపాటు పార్టీ సీనియర్ నాయకులు సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించినట్లు తెలిసింది. ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేయటం వలన ప్రభుత్వం, పార్టీ ఊపిరి పీల్చుకునేందుకు వీలుకలిగిందనే అభిప్రాయాన్ని నాయకులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు కూడా ఉత్తరాఖండ్ తీర్పును బలపరిచి ఉంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాధికారం ప్రశ్నార్థకమయ్యేదని ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కోర్టులు ముఖ్యంగా కొందరు న్యాయమూర్తులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఒక సీనియర్ నాయకుడు అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఈనెల 27 వరకు రాష్టప్రతి పాలనను తొలగించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్య తీసుకోకూడదని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించటం గమనార్హం. రాష్టప్రతి పాలనను తొలగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. మొత్తం పరిస్థితిని అధ్యయనం చేసేందుకు తమకు కొంత సమయం కావాలి కాబట్టి ఈనెల 27 వరకు హైకోర్టు తీర్పును నిలిపివేస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది.
మరోవైపు ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేయటంతో కాంగ్రెస్ వర్గాలు నిరుత్సాహానికి గురి అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం, దీని మూలంగా ఉత్తరాఖండ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల గురించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరించారు