జాతీయ వార్తలు

అరుణాచల్‌ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్, ఏప్రిల్ 22: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో ఎడతెగని వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు ఒక లేబర్ క్యాంప్‌పై విరిగిపడ్డంతో కనీసం 16 మంది సజీవ సమాధి అయ్యారు. తవాంగ్ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని ఫమ్లా గ్రామం వద్ద కన్‌స్ట్రక్షన్ పనులు చేసే కార్మికులు క్యాంప్‌లోపల నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శిథిలాల కిందినుంచి మొత్తం 16 మృత దేహాలను వెలికి తీసారని, తీవ్రంగా గాయపడిన ఒకరిని పొరుగు రాష్టమ్రైన అసోంలోని తేజ్‌పూర్ ఆస్పత్రికి తరలించామని జిల్లా ఎస్‌పి ఆంటో ఆల్ఫోనే్స చెప్పారు. ఇద్దరు కార్మికులు సురక్షితంగా బైటపడినట్లు ఆయన చెప్పారు. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక చోట్ల కొండచరియలు విరిగి పడినట్లు ఆయన చెప్పారు. సైన్యం, స్థానిక ప్రభుత్వ సిబ్బంది, పోలీసులు, గ్రామస్థులు కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో మృత దేహాలను వెలికి తీసినట్లు ఆయన చెప్పారు. కొండచరియలు విరిగిపడ్డం కారణంగా న్యూలెబ్రాంగ్, ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ మధ్య ఉన్న పిడబ్ల్యుడి రోడ్డు కూడా మూసుకుపోయిందని, ఈ ప్రాంతంలోని అనేక నివాస భవనాలు దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయని ఆయన చెప్పారు. ఈ సంఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలయజేవారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు, పిసిసి, ఇతర విభాగాలను ఆదేశించారు.