జాతీయ వార్తలు

భూమాతను పూజించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: మానవ మనుగడకు అవసరమైన అన్నింటినీ ప్రసాదించిన భూమాతను పూజించాలని, భూమాత పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భూమాత ప్రాముఖ్యత గురించి మానవ జాతిని జాగృతం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ‘ఎర్త్ డే’ను పాటిస్తున్న తరుణంలో ప్రధాని సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో ఈ పిలుపునిచ్చారు. ‘ఎర్త్ డే రోజున మనకు అన్నింటినీ ఇచ్చిన మన భూమాతను పూజించాలి. కృతజ్ఞతలు వ్యక్తం చేయాలి’ అని మోదీ తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడే ఉద్దేశంతో 1970 నుంచి ఏటా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ డేను నిర్వహిస్తున్నారు. ఎర్త్ డే నెట్‌వర్క్ ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తోంది. 193 దేశాలలో ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.