జాతీయ వార్తలు

రేపు సంయుక్త జాతీయ న్యాయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశంలో న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సమావేశం అవుతున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఆస్.్ఠకుర్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ సమక్షంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సును ప్రారంభిస్తారు. న్యాయ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దటం, కేసుల విచారణ త్వరితగతిన పూర్తిచేసేందుకు తీసుకోవలసిన చర్యలు, న్యాయమూర్తుల ఖాళీలను త్వరితగతిన భర్తీచేయటం తదితర ఆంశాలపై ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ ముఖాముఖి చర్చలు జరిపి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారు. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు కూడా ఈ సంయుక్త సదస్సు ఎంతో తోడ్పడుతుంది. కేసుల విచారణలో కొనసాగుతున్న జాప్యం, వాణిజ్యపరమైన తగాదాలను వీలున్నంత త్వరగా పరిష్కరించేందుకు అనుసరిస్తున్న విధానాలను మరింత పటిష్టం చేయటం, న్యాయ వ్యవస్థను మరింత సులభతరం చేయటంతోపాటు సగటు మనిషికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవలసి ఉన్నదనేది కూడా సంయుక్త సదస్సులో చర్చించనున్నారు. లీగల్ ఎయిడ్ సేవల నాణ్యత పెంచటం గురించి చర్చించి ఈ లక్ష్య సాధనకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. వౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని నిధులు కేటాయించటం, కోర్టుల సంఖ్యను పెంచటంపై సంయుక్త సదస్సులో దృష్టి కేంద్రీకరించనున్నారు. ఈ-కోర్టుల మిషన్‌ను మరింత పటిష్టం చేయనున్నారు.