జాతీయ వార్తలు

మోదీ, షా క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్టప్రతి పాలనను తోసిపుచ్చుతూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గురువారం భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కినందుకు, రాజ్యాంగాన్ని ఖూనీ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిం ది. ఎన్నికయిన ప్రభుత్వాన్ని కూలదోయడానికి యత్నించిన బిజెపికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని పేర్కొంది. హైకోర్టు తీర్పు ఉత్తరాఖండ్ ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ నిబంధనలు సాధించిన విజయమని ఎఐసిసి కమ్యూనికేషన్స్ విభాగం ఇన్‌చార్జి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా అభివర్ణించారు. హైకోర్టు ఇచ్చిన ఈ నిర్ణాయక తీర్పునుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గుణపాఠం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసి, రాజ్యాంగ నిబంధనలను ఖూనీ చేసి, ఎన్నికయిన కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నించినందుకు ప్రధా ని మోదీ, అమిత్ షా దేశానికి, ఉత్తరాఖండ్ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సుర్జేవాలా డిమాండ్ చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చడానికి ధనబలం, కండబలంతో బిజెపి, కేంద్రం పన్నిన కుట్రలకు ఇకనైనా తెరపడుతుందని భావిస్తున్నామన్నారు.
ఉత్తరాఖండ్ ప్రజల విజయం: రావత్
డెహ్రాడూన్: రాష్టప్రతి పాలనను తోసిపుచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉత్తరాఖండ్ ప్రజల విజయమని రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అన్నారు. ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు.
హైకోర్టు తీర్పు చరిత్రాత్మకం: స్పీకర్
రాష్టప్రతి పాలనను తోసిపుచ్చుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనదని ఉత్తరాఖండ్ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్‌వాల్ అభివర్ణించారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిస్తున్న కేంద్రానికి ఇది చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పు భవిష్యత్తులో దేశానికి పూర్వ ప్రమాణంగా, పూర్వోదాహరణగా ఉంటుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ్ కూడా హైకోర్టు తీర్పును స్వాగతించారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి ప్రయత్నించిన వారు ఈ తీర్పు నుంచి గుణపాఠం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు ప్రతికోసం వేచి చూస్తున్నామని, దాన్ని సమగ్రంగా పరిశీలించిన తరువాతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన చెప్పారు.