జాతీయ వార్తలు

నేడు చిన్నబోనున్న చంద్రుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 21: పున్నమి రోజున చంద్రుడు నిండుగా కనిపించడం సహజం. అయితే శుక్రవారం పున్నమి రోజున మాత్రం చంద్రుడు కాస్త చిన్నబోనున్నాడు.‘మినీ మూన్’గా శాస్తజ్ఞ్రులు అభివర్ణించే ఈ సంఘటన మరో 15 ఏళ్లకోసారి మాత్రమే సంభవిస్తుంది. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9.35 గంటల సమయంలో భూమి చుట్టూ పరిభ్రమించే చంద్రుడు తన కక్ష్యలో సుదూరమైన పాయింట్‌వద్ద-అంటే భూమినుంచి దాదాపు 4,06,350 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. మామూలుగా అయితే చంద్రుడు భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. శుక్రవారం నిండుపున్నమి సంభవించినప్పుడు చంద్రుడు భూమికి అత్యంత దూరంగా ఉండే పాయింట్‌కు దగ్గర్లో ఉంటాడని, అందువల్ల మామూలుగా ఉండే సైజుకన్నా చిన్నగా ఉంటాడని కోల్‌కతా ఎంపి బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ దేవి ప్రసాద్ దువారి పిటిఐతో అన్నారు. శుక్రవారం ఉదయం 10.55 గంటలకు పగటిపూట ఈ అరుదైన సంఘటన జరుగుతుంది గనుక ఇది మన కంటికి కనిపించదు. అయితే రాత్రి పూట మాత్రం ‘మినీ మూన్’ కాస్త చిన్నగా కనిపిస్తాడు. కాగా, ఇలాంటి సంఘటన మళ్లీ 2030 డిసెంబర్ 10న సంభవిస్తుందని దేవీ ప్రసాద్ చెప్పారు. అయితే ఇంటర్నెట్‌లో ప్రచారం అవుతున్నట్లుగా సమయంలో చంద్రుడు లేత ఎరుపు(పింక్)లేదా పసుపు రంగులో కానీ ఉండడని, మామూలుగా ఉండే ధవళ వర్ణంలోనే ఉంటాడని ఆయన చెప్పారు. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సంభవించే ‘సూపర్‌మూన్’తో పోలిస్తే ‘మినీ మూన్’ సైజు 14 శాతం తక్కువగా ఉంటుంది.