జాతీయ వార్తలు

ఇద్దరు పిల్లల నిబంధన ముస్లింలకూ విధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ప్రభుత్వం జనాభా విధానంలో మార్పు తేవాలని, ఇద్దరు పిల్లల నిబంధనను అన్ని మతాల ప్రజలకు తప్పనిసరి చేయాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు. భారత్ ఇలా చేయడంలో విఫలమైతే, ‘కుమార్తెలు క్షేమంగా ఉండలేరు. పాకిస్తాన్‌లో వలె ముఖాలపై ముసుగులు ధరించుకోవలసి వస్తుంది’ అని మంత్రి వ్యాఖ్యానించినట్లు ఒక ఆంగ్ల దినపత్రిక పేర్కొంది. నవడ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్‌పై ఎన్నికయిన గిరిరాజ్ సింగ్ బిహార్‌లోని పశ్చిమ చంపరాన్ జిల్లా బగహాలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయిన సభికుల్లో అనేక మంది సాధువులు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఉన్నారు. బిహార్‌లోని అనేక జిల్లాల్లో ముస్లింల జనాభా హిందువుల జనాభాకన్నా వేగంగా పెరుగుతోందని మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ శాఖ సహాయ మంత్రి అయిన గిరిరాజ్ సింగ్ అన్నారు.