జాతీయ వార్తలు

భగత్‌సింగ్‌తో కన్హయ్యకు పోలికా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: దేశద్రోహ అభియోగాలు ఎదుర్కొంటున్న జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను భగత్‌సింగ్‌తో పోల్చడం ద్వారా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశి థరూర్ వివాదానికి తెరలేపారు. శశి థరూర్ వ్యాఖ్యలపై బిజెపి సోమవారం మండిపడింది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ థరూర్ వ్యాఖ్యలతో ఏకీభవించకుండా దూరం పాటించింది. థరూర్ ఆదివారం రాత్రి జెఎన్‌యు క్యాంపస్‌లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బ్రిటిష్ హయాంలో రాజద్రోహ చట్టానికి గురయిన బాధితుల పేర్లను ప్రస్తావించారు. జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ, బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్ ఈ చట్టం బాధితులని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లోని ఒక బాలిక భగత్‌సింగ్ పేరును ఉటంకించారు. థరూర్ వెంటనే స్పందిస్తూ ‘్భగత్‌సింగ్ ఆ కాలంలో ఈనాటి కన్హయ్య కుమార్’ అని వ్యాఖ్యానించారు. అయితే థరూర్ వ్యాఖ్యలపై బిజెపి సోమవారం మండిపడింది. కన్హయ్య కుమార్‌ను భగత్‌సింగ్‌తో పోల్చడం గొప్ప స్వాతంత్య్ర సమరయోధులను, దేశభక్తులను అవమానించడమేనని విమర్శించింది. కన్హయ్య కుమార్ భగత్‌సింగ్ అయితే, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఎవరో థరూర్ చెప్పాలని బిజెపి నాయకుడు షానవాజ్ హుస్సేన్ నిలదీశారు. థరూర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ కూడా ఏకీభవించలేదు. థరూర్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా సోమవారం విలేఖరులు కోరినప్పుడు ‘్భగత్‌సింగ్ ఒక్కరే ఉన్నారు’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీశ్ తివారి బదులిచ్చారు. అయితే కన్హయ్య కుమార్‌ను భగత్‌సింగ్‌తో సమానంగా చూడటం తన ఉద్దేశం కాదని థరూర్ ఆ తరువాత వివరణ ఇచ్చారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనకు బదులుగా చెప్పిన చిన్న విషయం అదని ఆయన పేర్కొన్నారు.
భగత్‌సింగ్ వలస పాలనకు, విదేశీ అణచివేతకు వ్యతిరేకంగా ఆనాడు పోరాడారని, అందుకు భిన్నమైన ప్రజాస్వామ్యంలో నేడు కన్హయ్య కుమార్ తన విశ్వాసాల కోసం పోరాడుతున్నారని థరూర్ వివరించారు. అప్పటి, ఇప్పటి పరిస్థితులు వేరయినా యువకుడు, మార్క్సిస్టు సైద్ధాంతికవేత్త ఇద్దరూ కూడా తమ 20వ పడిలో తమ మాతృదేశం కోసం ఆవేశంగా పోరాడటం అనేది ఇక్కడ పోలిక అని ఆయన వివరించారు.