జాతీయ వార్తలు

అద్దె తగ్గించాలంటూ బేరమాడిన ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: కొన్ని విషయాలకొచ్చేసరికి ఎంత గొప్పవారయినా సామాన్యుల్లాగానే ప్ర వర్తిస్తారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీల కుమార్తె అయిన ప్రియాంక గాంధీ కూడా అద్దె విషయానికి వచ్చే సరికి సామాన్యుల్లాగానే బేరమాడి అద్దె ను తగ్గించుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం 1997లో ప్రియాంక గాంధీకి ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లో ఓ భవనాన్ని కేటాయించింది. 2765 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన విశాలమైన భవనానికి అప్పట్లో అద్దె నెలకు రూ. 19,990లు ఉండేది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ అద్దె పెంచేది. 2002 సంవత్సరం వచ్చేసరికి ఆ అద్దె రూ. 53 వేలకు చేరుకుంది. అయితే అంత అద్దె ఇచ్చుకునే స్తోమతు తనకు లేదని, అద్దె తగ్గించాలని కోరుతూ ప్రియాంక 2002 మే 7న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి ఒక లేఖ రాశారు. ఎస్‌పిజి సిఫార్సు మేరకే తనకు ఆ బంగళా కేటాయించారని, బంగళాలో ఎక్కువ భాగం ఎస్‌పిజి సిబ్బందే ఆక్రమించుకున్నారని కూడా ఆమె ఆ లేఖలో తెలిపారు. ప్రియాంక విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం ఆ బంగళా అద్దెను ఏకంగా రూ. 8,888కి తగ్గించింది. ప్రస్తుతం ప్రియాంక ఆ బంగళాకు రూ. 31,300 అద్దె చెల్లిస్తున్నారు. నోయిడాకు చెందిన దేవ్ ఆశీష్ భట్టాచార్య అనే అతను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ వివరాలు తెలియజేసింది.