జాతీయ వార్తలు

సంయమనమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, ఏప్రిల్ 16: భారత రాజ్యాంగం రాజ్యంలోని మూడు వ్యవస్థల మధ్య స్పష్టమైన అధికారాల విభజనను ఏర్పాటు చేసిందని పేర్కొంటూ న్యాయ వ్యవస్థ క్రియాశీలత ఈ అధికారాల విభజనను నీరుగార్చడానికి దారితీయకూడదని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ న్యాయమూర్తులకు సూచించారు. రాజ్యాంగం అత్యున్నతమైనదని, మన ప్రజాస్వామ్యంలోని ప్రతి అంగం తప్పనిసరిగా తన పరిధిలో పనిచేయాలని, మరో అంగానికి కేటాయించిన అధికారాలను హస్తగతం చేసుకోకూడదని ఆయన హితవు పలికారు. రాజ్యంలోని మూడు వ్యవస్థల మధ్య అధికారాల సమతుల్యత మన రాజ్యాంగంలో పొందుపరచి ఉందని, ఎల్లవేళలా ఈ సమతుల్యతను పాటించాలని ఆయన అన్నారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహకవర్గం ఉపయోగించే అధికారాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే న్యాయ వ్యవస్థ స్వయంగా విధించుకున్న క్రమశిక్షణను, స్వయం సంయమనాన్ని పాటించడం వల్ల మాత్రమే ఆ వ్యవస్థ ఉపయోగించుకునే అధికారాలకు తనిఖీగా ఉంటుందని రాష్టప్రతి వివరించారు. శనివారం ఇక్కడి నేషనల్ జుడీషియల్ అకాడమీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నాలుగో సదస్సును ప్రారంభిస్తూ రాష్టప్రతి ఈ వ్యాఖ్యలు చేశారు. మన రాజ్యాంగం మనకు స్వతంత్ర న్యాయ వ్యవస్థను ముఖ్యంగా శాసన వ్యవస్థ చేసే చట్టాలను, కార్యనిర్వాహక వ్యవస్థ చర్యలను సమీక్షించే విస్తృత పరిధితో కూడిన అత్యున్నత న్యాయస్థానాన్ని ఇచ్చిందని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. న్యాయ సమీక్ష వౌలిక స్వరూపంలో భాగమని, చట్టంలో పొందుపరచిన విధానాల ఆధారంగా దీన్ని మార్చజాలమని అన్నారు.
దేశంలో న్యాయ వ్యవస్థ న్యాయం పరిధిని విస్తృతం చేస్తోందని రాష్టప్రతి ప్రశంసించారు. ప్రాథమిక హక్కులను అమలు చేయించడం కోసం సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ సృజనాత్మకత, క్రియాశీలత ద్వారా కామన్ లా సూత్రాన్ని విస్తృతం చేసిందని ఆయన పేర్కొన్నారు. పౌరుల హక్కులకు మద్దతిస్తూ ఎవరైనా పోస్టుకార్డు రాసినా లేదా వార్తాపత్రికల్లో వార్తాకథనాల ఆధారంగానయినా కోర్టులు న్యాయపరమైన చర్యకు పూనుకుంటున్నాయని ఆయన ప్రశంసించారు. మన ప్రజాస్వామ్యంలోని మూడు ప్రధాన అంగాల్లో రాజ్యాంగాన్ని, చట్టాలను విశే్లషించే తుది విభాగం న్యాయ వ్యవస్థ అని రాష్టప్రతి పేర్కొన్నారు. సామాజిక-ఆర్థిక పిరమిడ్‌లో అనేకమంది ప్రజలు అట్టడుగున ఉన్న భారత్ వంటి దేశంలో న్యాయ వ్యవస్థ ఆర్థికంగా భరించగలిగేలా ఉండటం అనేది అత్యంత ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ వేగంగా పనిచేయడంతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. ‘ఆలస్యంగా అందిన న్యాయం న్యాయాన్ని తిరస్కరించడమే అవుతుంది’ అన్న సూక్తిని ఆయన ప్రస్తావించారు.

చిత్రం భోపాల్‌ల్ శనివారం జరిగిన సుప్రీం జడ్జీల సదస్సులో పాల్గొన్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.్ఠకూర్, ఎంపి సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్