జాతీయ వార్తలు

ఢిల్లీ యూనివర్శిటీ లెక్చరర్ గిలానీకి బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: దేశద్రోహం కేసులో అరెస్టయిన ఢిల్లీ యూనివర్శిటీ అధ్యాపకుడు ఎస్‌ఎఆర్ గిలానీకి ఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జి దీపక్ గర్గ్ బెయిల్ మంజూరు చేశారు. గత నెలలో ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ప్రెస్‌క్లబ్ గిలానీ పేరుతోనే బుక్ అయింది. శనివారం బెయిల్ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి 50వేల నగదు, అంతే విలువైన వ్యక్తిగత పూచీకత్తు చెల్లించాలని ఆదేశించారు. గిలానీ ఎక్కడా జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్టు రికార్డయిలేదని ఆయన తరఫున్యాయవాది సతీశ్ టంటా వెల్లడించారు. కాశ్మీర్ సమస్యపై చర్చించేందుకు జరిగిన ఓ మేధావుల సమావేశమేతప్ప అందులో ఎలాంటి జాతి వ్యతిరేకత లేదని ఆయన పేర్కొన్నారు. నినాదాలు ఇవ్వడం నేరం కింద చూడకూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావించారు. కాగా గిలానీకి బెయిల్ ఇవ్వొద్దని ఢిల్లీ పోలీసులు కోర్టును అభ్యర్థించారు. గిలానీ కార్యక్రమం కోర్టు ధిక్కారమేకాకుండా మాతృదేశంపై దాడి అని వారు వాదించారు. జెఎన్‌యు వివాదం తరువాత చోటుచేసుకున్న ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంపై పోలీసులు దృష్టిసారించారు. గిలానీ కూడా జాతివ్యతిరేక నినాదాలు చేశారని ఢిల్లీ ప్రెస్‌క్లబ్ వర్గాలు తెలిపాయి.

ప్రెస్‌క్లబ్‌లో పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్‌గురు, మఖ్బూల్ భట్‌లను కీర్తిస్తూ బ్యానర్లు కట్టారని పోలీసులు కేసు నమోదు చేసి ఫిబ్రవరి 16 గిలానీని అరెస్టు చేశారు. 19న ఆయన చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను మెజిస్ట్రేట్ కొట్టివేశారు. శనివారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.