జాతీయ వార్తలు

‘క్యాబ్’తో బీజేపీకి లాభమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేకచోట్ల ఆందోళనలు జరుగుతున్నప్పటికీ దీనివల్ల తమకు నష్టం కంటే లాభమే ఎక్కువ ఉంటుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అస్సాంలో సొంత బలంతో, మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుత ఆందోళనలను అణచివేయగలమన్న ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, రాజకీయంగా ముఖ్యంగా అస్సాంలో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయన్న దానిపై ఎలాంటి అంచనా వేయలేకపోతోంది. అక్రమ వలసలకు వ్యతిరేకంగా హిందూ వర్గాలు సంఘటితం కావడంతో 2016లో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీర్ఘకాలంగా బంగ్లాదేశ్ అక్రమ వలసలను ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తూనే ఉండడం ఆ ఎన్నికల్లో బీజేపీకి అన్నివిధాలుగా కలసివచ్చింది. అయితే, ప్రస్తుతం అస్సాం ప్రత్యేక సంస్కృతి, అలాగే గుర్తింపు ఏమవుతాయోనన్న ఆందోళన తలెత్తడంతో రాజకీయంగా దీని పర్యవసానాలు ప్రస్తుత పరిస్థితులను తలకిందులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అస్సాం మాట ఎలా ఉన్నా, ‘క్యాబ్’ చట్టం అమలు వల్ల బంగ్లాదేశ్‌లో లబ్ధి పొందేవారి సంఖ్య గణనీయంగా ఉంటుందని, ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా ఇది తమకు ప్రయోజనం కలిగిస్తుందని బీజేపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ సభ్యుల సంఖ్య దాదాపు రెండు కోట్లకు చేరుకుందని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు.
రాష్ట్రంలో అధికారాన్ని ఎక్కడ కోల్పోతామోనన్న భయంతోనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘క్యాబ్’ చట్టానికి వ్యతిరేకంగా అశాంతిని రగిలిస్తున్నారని ఆయన ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలకు 20-21 ఏప్రి ల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. తాజా గా కేంద్రం చేపట్టిన బిల్లు ప్రకారం 2014 డిసెంబర్ 31 నాటికి మతపరమైన వేధింపులు కారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ నుంచి భారత్ చేరుకున్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవ వర్గాలకు భారత్ పౌరసత్వం లభిస్తుంది. వారిని ఇక ఎంతమాత్రం అక్రమ వలసదారులుగా పరిగణించరు.