జాతీయ వార్తలు

‘ఆయుష్మాన్’ కింద 65 లక్షల మందికి వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: కేంద్రం ప్రతిష్మాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి యోజన(ఏబీ-పీఎంజేఏవై) కింద ఇప్పటి వరకూ 65 లక్షల మంది రోగులకు వైద్య సహాయం అందినట్టు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వనీ ఛౌబే వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ‘ డిసెంబర్ 5వ తేదీనాటికి రూ. 9,549 కోట్ల రూపాయలతో వైద్యం అందించాం’అని స్పష్టం చేశారు. మొత్తం 65 లక్షల 45 వేల 733 మంది రోగులకు వైద్య సహాయం అందజేసినట్టు మంత్రి తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 35,34,695 మంది రోగుల కోసం 6,133 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు ఆయన పేర్కొన్నారు. ఏబీ-పీఎంజేఏవై కింద 1392 ప్రయోజనాలున్నాయని ఆయన సభకు తెలిపారు. వివిధ వ్యాధులకు రేట్లతో ప్యాకేజీలు నిర్ణయించి ఉంటాయని ఆయన చెప్పారు. ప్రాథమిక, తృతీయ స్థాయి హెల్త్‌కేర్ ప్యానెల్ ఆసుపత్రిలో వైద్యం అందుబాటులో ఉంటుందని ఛౌబే వివరించారు. నిర్ధారించని శస్తచ్రికిత్స ప్యాకేజీలు అదనం అన్నారు. ధరల విషయంలో ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన చెప్పారు. పథకం కింద బీమా కంపెనీలే చెల్లింపులు చేస్తాయని ఆయన వివరించారు. ప్యాకేజీ రేట్లు, పథకం అమలు, తదితర అంశాలపై ఆసుపత్రులు, సంస్థల నుంచి అభిప్రాయలు తెలుసుకుని మరింత సమర్ధవంతంగా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆరోగ్య బీమా గురించి మంత్రి మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రం ప్రీమియం నిష్పత్తి 60:40గా పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇదే వర్తిస్తుందన్న మంత్రి‘ హిమాలయ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకు కొంత వెసులుబాటు ఉంది. అక్కడ ప్రీమియం నిష్పత్తి 90:10గా ఉంది’ అని మరో పశ్నకు బదులిచ్చారు. కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికి వస్తే కేంద్రం వందకు వంద శాతం ప్రీమియం భరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రీమియం రేట్లు కాలానుగుణంగా మారుతూ ఉంటాయని మంత్రి వెల్లడించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఏబీ-పీఎంజేఏవై పథకం కింద 1013.76 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు రాజ్యసభలో తెలిపారు. గత ఏడాది రూ. 1849.55 కోట్లు కేటాయించినట్టు మంత్రి చెప్పారు.