జాతీయ వార్తలు

తెలుగు భాషాభివృద్ధికి కేంద్రం చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: తెలుగు భాష అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పోక్రియల్ సోమవారం లోక్‌సభలో హామీ ఇచ్చారు. ప్రాంతీయ భాషల పరిరక్షణ, అలాగే తెలుగు భాష కోసం తీసుకుంటున్న చర్యలపై టీడీపీ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయం ప్రస్తావించారు. దేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, తెలుగు భాషా అభివృద్ధికి ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆయన కోరారు. దేశంలో ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం వుందని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కేశినేని అభిప్రాయపడ్డారు. ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని తప్పినిసరి చేసిందని, త్రిభాషా విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం వుందన్నారు. దీనిపై కేంద్ర మంత్రి రమేశ్ పోక్రియాల్ సమాధానం ఇస్తూ భారతీయ భాషలను పటిష్టం చేయాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం వుందని వెల్లడించారు. తెలుగు భాషను పటిష్టం చేసే క్రమంలో మైసూరులోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సీఐఐఎల్) ఆధీనంలో ఉన్న తెలుగు క్లాసికల్ అభివృద్ధి సంస్థను నెల్లూరుకు మార్చినట్టు తెలిపారు. ఈ సంస్థ నవంబర్ 13 నుంచి పనిచేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు. తెలుగు భాష అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బెనారస్ హిందు విశ్వవిద్యాలయం, ఆలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయాలతో పాటు ఏపీలో ఏర్పాటు చేసిన సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు పాఠ్యాంశంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.