జాతీయ వార్తలు

సమాఖ్య వ్యవస్థకు ఆత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: శాశ్వతమైన రాజ్యసభ భారతదేశ సమాఖ్య వ్యవస్థకు ఆత్మలాంటిదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అనే నదికి లోక్‌సభ, రాజ్యసభలు రెండు ఒడ్డులవంటివి.. ఈ రెండూ బాగున్నప్పుడే నదీ ప్రవాహం బాగుంటుందని మోదీ పేర్కొన్నారు. రాజ్యసభ ‘చెకింగ్ అండ్ బ్యాలెన్సింగ్’లా పని చేయాలి తప్ప ‘బ్లాకింగ్’ పని చేయకూడదని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. మన భిన్నంత్వంలోని ఏకత్వం సంస్కృతికి రాజ్యసభ అద్దం పడుతుందన్నారు. ఎన్నికల ఒడుదుడుకులను తట్టుకోలేని మేథావులు రాజ్యసభకు వస్తారు.. అయితే దేశాభివృద్ధిలో వీరి సహకారం, పాత్రను తగ్గించలేమని నరేంద్ర మోదీ సోమవారం రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా జరిగిన ప్రత్యేక చర్చలో చెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి పలువురు మహానుభావులు రాజ్యసభకు వచ్చారని.. ఒకప్పుడు రాజ్యసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ విధానం ఉండేది కాదు.. అయితే ఇప్పుడు మాత్ర రెండు పక్షాల మధ్య ఘర్షణ విధానం కొనసాగుతోందని అన్నారు. అధికారంలో ఉన్నవారు సరైన మార్గంలోనే ముందుకు సాగేలా చూడటంలో ప్రతిపక్షం ఎంతో కీలకపాత్ర నిర్వహించిందని.. తత్వవేత్త, మాజీ ఉప రాష్టప్రతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరును ప్రధాని ప్రస్తావించారు. రాజ్యసభలో చారిత్రాత్మక బిల్లులు పాసయ్యాయని ప్రధాని చెప్పారు. కొన్ని బిల్లులను పాస్ చేయటంలో
తాను కూడా భాగం పంచుకున్నానని.. రాజ్యసభ చర్చలు నుండి తాను ఎంతో నేర్చుకున్నానని ఆయన అంగీకరించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించిన ఘనత రాజ్యసభకు దక్కుతుందని మోదీ ప్రశంసించారు. ఈ బిల్లును అడ్డం పెట్టుకుని కొందరు దేశంలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించినా ఎవ్వరూ పట్టించుకోలేదని ఆయన చెప్పారు. ఉన్నత వర్గాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యా సంస్థల్లో పది శాతం సీట్లు రిజర్వు చేసేందుకు సంబందించిన బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించటం ప్రశంసనీయమన్నారు. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రద్దు చేసిన ఘనత కూడా రాజ్యసభకు దక్కుతుందని మోదీ అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాల మధ్య తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు కలిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని.. కేంద్రం, రాష్ట్రాలు ప్రత్యర్థులు కాదు.. సహభాగస్వాములని.. కేంద్రం, రాష్ట్రాలు వేర్వేరు కావని అన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణ ఉంటే దేశం అభివృద్ధి చెందదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ ఎనలేని సేవ చేస్తోందని మోదీ అభిప్రాయపడ్డారు. రాజ్యసభ 200వ సమావేశం సందర్భంగా అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ రాజ్యసభను ప్రాధాన్యత లేని సభగా మార్చవద్దని సూచించారు. దీనికి మనమందరం కుట్టుబడి ఉండాలని అన్నారు. రాజ్యసభ సెకండ్ హౌజ్.. దీనిని సెకండరీ హౌజ్ చేయకూడదన్న వాజపేయి మాటలను మరిచిపోరాదన్నారు. కేంద్రం పటిష్టంగా ఉండటంతోపాటు రాష్ట్రాల అభివృద్ధి కూడా సాధించాలన్నారు. రాజ్యసభ మూల సిద్ధాంతాలు ‘చెకింగ్ అండ్ బ్యాలెన్సింగ్’ ఉండాలి తప్ప బ్లాకింగ్ వ్యవస్థ కారాదని అన్నారు. రాజ్యసభలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలి తప్ప తగాదాలను సృష్టించకూడదని ఆయన అన్నారు.
ఎన్‌సీపీ, బీజేడీకి ప్రశంసలు
రాజ్యసభ పోడియం వద్దకు వచ్చి గొడవ చేయకుండా తమ లక్ష్యాన్ని సాధించేందుకు బీజేపీతోపాటు పలు ఇతర పార్టీలు జేడీయూ, ఎన్‌సీపీ నుంచి నేర్చుకోవలిసింది ఎంతో ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. మహారాష్టల్రో తమ పాత మిత్రపక్షం శివసేనతో కలిసి ఎన్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ సోమవారం రాజ్యసభలో ఎన్‌సీపీని ప్రశంసలతో ముంచెత్తటం గమనార్హం. సీనియర్ నాయకుడు శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సీపీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ సభ్యులు రాజ్యసభలో పోడియం వద్దకు వచ్చి ఎప్పుడు నినాదాలతో గొడవ చేయలేదు.. అయినా వారు తమ సమస్యలను పరిష్కరించుకోగలిగారు.. ఇది వారి గొప్పతనమని అన్నారు. రాజ్యసభ పోడియం వద్దకు వచ్చి గొడవ చేయకుండానే తమ లక్ష్యాల సాధన కోసం కృషిచేసే విషయంలో తమ పార్టీ బీజేపీతోపాటు ఎన్‌సీపీ, బీజేడీ నుంచి గుణపాఠం నేర్చుకోవాలని ఆయన అన్నారు. ఈ రెండు పార్టీలు ఎప్పుడూ కూడా పోడియం వద్దకు వెళ్లి గొడవ చేయలేదు.. అందుకు వారిని అభినందిస్తున్నానని మోదీ చెప్పారు. రాజ్యసభ 250 సమావేశాలు ఎంతో ప్రశంసనీయమని మోదీ కొనియాడారు. రాజ్యసభలో ఎన్నో చరిత్రలు ఎర్పడ్డాయి.. చరిత్రను మలుపు తిప్పటంలో కూడా రాజ్యసభ కీలకపాత్ర నిర్వహించిందని ఆయన చెప్పారు. రాజ్యసభ పోడియం వద్దకు వెళ్లకూడదన్న తమ నిర్ణయాన్ని ఎన్‌సీపీ, జేడీయూకు చెందిన ఒక్క సభ్యుడు కూడా ఉల్లంఘించలేదని ఆయన ప్రశంసించారు.

*చిత్రం... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ