జాతీయ వార్తలు

పొంచి ఉన్న మరో సవాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య, నవంబర్ 16: అయోధ్యలో దశాబ్దాల రామాలయ వివాదాన్ని సుప్రీంకోర్టు శాశ్వతంగా పరిష్కరించిన నేపథ్యంలో వచ్చే నెల 6న జరుగనున్న బాబరీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం ఎలాంటి అలజడులకు దారితీయకుండా ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అన్నివిధాలుగానూ రామ జన్మభూమి ప్రాంతం చుట్టూ గట్టి భద్రతను ఏర్పాటు చేశామని, ఈ ప్రాంతం రెడ్ జోన్ పరిధిలో ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతోపాటు నగరంలోని మత ప్రాధాన్యత కలిగిన ఇంకా అనేక కేంద్రాల వద్ద కూడా భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసినట్టు అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ ఝా వెల్లడించారు. సుప్రీం తీర్పుకు ముందు కూడా అయోధ్య పట్టణం చుట్టూ కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా భద్రత, నిఘా చర్యలను కొనసాగించామని, ఇప్పుడు బాబరీ కూల్చివేత వార్షికోత్సవం మరో మూడు వారాల్లో జరుగనున్న దృష్ట్యా మరింత విస్తృంగా ఈ ఏర్పాట్లను కొనసాగిస్తామని ఆయన తెలిపారు. డిసెంబర్ 6న శాంతి, సామరస్యం, ప్రశాంత పరిస్థితులకు ఎలాంటి విఘాతం కలుగకుండా చూడడమే ఇప్పుడు తమ ముందున్న పెద్ద సవాల్ అని ఆయన తెలిపారు. అయితే, నగర ప్రజలు శాంతియుతంగానే వ్యవహరిస్తారనే నమ్మకం తనకు ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయోధ్యలో నాలుగు జోన్ల భద్రతను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం రెడ్ జోన్ పరిధిలో ఉందని తెలిపారు. ఎల్లో జోన్‌ను నగరంలో అమలు చేస్తున్నామని, గ్రీన్ జోన్ జిల్లాలోను, బ్లూ జోన్‌ను జిల్లా ఇరుగుపొరుగు ప్రాంతంలోనూ అము చేస్తున్నామని ఆయన ప్రకటించారు.