జాతీయ వార్తలు

కేంద్ర చొరవను స్వాగతించిన ఖండూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నామ్‌సాయి, నవంబర్ 16: దశాబ్దాల నాటి ‘నాగా’ సమస్య పరిష్కారం దిశగా కేంద్రం తీసుకుంటున్న చర్యలను అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ స్వాగతించారు. రాష్ట్ర ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీపడకుండా కేంద్రం తీసుకున్న చొరవకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నాగా సమస్యను పరిష్కరించడం ద్వారా రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలన్నది కేంద్రం లక్ష్యం. దీని కోసం అన్ని వర్గాలతో చర్చలు సాగుతాయని ఖండూ వెల్లడించారు. దశాబ్దాల నాటి నాగా సమస్యను పరిష్కరించాలని కేంద్ర చిత్తశుద్ధితో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా త్వరలోనే అఖిలపక్ష సమావేశం జరుగుతోందని ఆయన అన్నారు. నేషనల్ ప్రెస్ దినోత్సవం సందర్భంగా ఖండూ మీడియాతో మాట్లాడుతూ ‘ రాష్ట్రం తమ అభిప్రాయం తెలియజేస్తూ కేంద్రానికి నివేదిక ఇస్తుంది’అని తెలిపారు. నాగా శాంతి ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపకూడదన్నదే తమ అభిప్రాయం అని ఖండూ చెప్పారు. ఈవిషయలంతో తమ వైఖరి కచ్చితంగా ఉందన్నారు. కాగా ఎన్‌ఎస్‌సీఎన్-ఐఎం తీవ్రవాద సంస్థ మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని నాగా జనవాసాల ఏకీకరణకు చేసిన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందే తిరస్కరించింది. అలాగే మూడు ఈశాన్య రాష్ట్రాలూ ముక్తకంఠంతో తిరస్కరించాయి. మూడు రాష్ట్రాల నాగా గ్రూపులు, సంస్థలతో చర్చించిన తరువాతే సమస్య పరిష్కారానికి చర్యలుంటాయని కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని నాగా జనవాసాలను కలుపుతూ ‘నాగాలిమ్’లేదా గ్రేటర్ నాగాలండ్ ఏర్పాటు చేయాలని ఎన్‌ఎస్‌సీఎన్-ఐఎం డిమాండ్ చేస్తోంది. తద్వారా ఈశాన్య రాష్ట్రాల నాగాల పాలన ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని తీవ్రవాద సంస్థ కోరుతోంది. దీనికి సంబంధించి ఏకంగా ఏ మ్యాప్‌ను సైతం సంస్థ విడుదల చేసింది. నాగాలాండ్‌లోని 16,527 చదరపుకిలోమీటర్ల ప్రాంతం దాటి 1,03,473 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణంతో మ్యాప్‌ను విడుదల చేశారు. మ్యాప్‌లో అంజావ్, ఛంగ్లాంగ్, లోహిత్, లాంగ్‌డింగ్, నామ్‌సాయి, తిరాప్ ఉన్నాయి.