జాతీయ వార్తలు

హామీ నిలబెట్టుకోండి.. నిధులు విడుదల చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 14: కేంద్ర ప్రభుత్వం బెంగాల్ అన్న ఒక్క కారణంతోనే నిధులు ఇవ్వడం లేదని తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం నిధులు కేటాయించి ఉంటే బుల్‌బుల్ తుపాను పీడిత ప్రాంతంలో సహాయ కార్యక్రమాలుకు వినియోగించి ఉండేవారమని గురువారం ఇక్కడ చెప్పారు. అయితే ప్రధాని నరేంద్రమోదీ తమకు ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేస్తారన్న విశ్వాసం ఆమె వ్యక్తం చేశారు. తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తామని మోదీ చెప్పారని మమత పేర్కొన్నారు. ‘కేంద్రం నుంచి 17వేల కోట్ల సాయం అందాల్సి ఉంది. కేంద్రం నిధులిస్తే తుపాను సహాయ కార్యక్రమాలు చేపడతాం’అని ఆమె వెల్లడించారు. కోల్‌కతాలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి రావల్సిన బకాయిల గురించి కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిపారు. ‘బుల్‌బుల్ పెద్ద తుపాను. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. బాధితులను ఆదుకోవల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. ఈ విషయంలోనూ కొందరు రాజకీయాలు చేస్తున్నారు. ఇది సరైంది కాదు’అని ఆమె అన్నారు. రాజకీయాలు చేయడానికి ఇది తగిన సమయం కాదని, తుపాను బాధితులను ఆదుకోవల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు, బీజేపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని, ఇకపైనా వాటిని కట్టిపెట్టాలని ఆమె హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటూ ప్రజలకు సేవలందించాలని పశ్చిమ బెంగాల్ సీఎం హితవు పలికారు.