జాతీయ వార్తలు

తీస్ హజారి కోర్టు వద్ద మళ్లీ విధుల్లోకి పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: ఢిల్లీలోని తీస్ హజారి కోర్టు ఆవరణలో న్యాయవాదులతో ఘర్షణ జరిగిన సుమారు రెండు వారాల తరువాత ఢిల్లీ పోలీసులు తిరిగి కోర్టు ఆవరణలో భద్రతా విధులను గురువారం ప్రారంభించారు. అయితే, న్యాయవాదులు మాత్రం తమ విధుల బహిష్కరణను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. డిప్యూటి పోలీసు కమిషనర్ మోనికా భరద్వాజ్ భద్రతా పరిస్థితి గురించి జిల్లా జడ్జి గిరీశ్ కథ్‌పాలియాకు తెలియజేశారు. కోర్టు ఆవరణలోని మూడు గేట్ల వద్ద పోలీసు సిబ్బందిని మోహరించినట్టు వివరించారు. ఇరు వర్గాల మధ్య శత్రుపూరిత వాతావరణం నెలకొని ఉందన్న భయాందోళనల మధ్య సుమారు 20 మంది పోలీసు సిబ్బంది యూనిఫామ్‌లకు బదులు సివిల్ దుస్తులు ధరించి విధినిర్వహణను పునఃప్రారంభించారు. కోర్టు ఆవరణ ప్రతి గేట్ వద్ద, ఇటీవల ఇరు వర్గాల మధ్య ఘర్షణ సందర్భంగా పోలీసు కాల్పులు జరిగిన లాకప్ ప్రాంతంలోనూ గురువారం పోలీసు సిబ్బంది భద్రతా విధులు నిర్వహించారు. ఒకవేళ న్యాయవాదులతో ఏమైనా వివాదం చోటు చేసుకుంటే వెంటనే ఆ విషయాన్ని పై అధికారులకు తెలియజేయాలనే ఆదేశాలు విధులకు హాజరయిన పోలీసులకు అందాయి.
ఇదిలా ఉండగా, నవంబర్ తొలి రోజుల్లో తీస్ హజారి కోర్టు ఆవరణలో పోలీసులు ఘర్షణకు దిగిన ఘటనకు నిరసనగా దేశ రాజధానిలోని ఆరు జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు గురువారం కూడా తమ విధులు బహిష్కరించారు. న్యాయవాదుల తరపున ఇతర న్యాయవాదులు కోర్టులకు హాజరయి కక్షిదారులకు సహకరించడానికి విచారణ తేదీలను తీసుకుంటున్నారు. వందలాది మంది న్యాయవాదులు గురువారం సాకేత్ కోర్టుకు సమీపంలో రోడ్డుపై ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకున్న న్యాయవాదులు ‘మాకు న్యాయం చేయండి’ అంటూ నినదించారు. న్యాయవాదుల ప్రదర్శనతో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు కొన్ని వాహనాలను దారిమళ్లించారు.