జాతీయ వార్తలు

మెరుగవుతున్న లత ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 12: ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ఆమె క్రమంగా కోలుకుంటున్నారని ఇక్కడి బ్రీచ్ కాండీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో లతా మంగేష్కర్‌ను ఈ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ మెరుగవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. 90 సంవత్సరాల లతా మంగేష్కర్‌కు డాక్టర్ పతిత్ సంధానీ చికిత్స చేస్తున్నారు. లత ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఆమె సన్నిహిత వర్గాలు కూడా వెల్లడించాయి. దశాబ్దాలపాటు వేలాది పాటలు పాడడం వల్ల ఆమె ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిందని, ఇప్పుడు వయసు మీద పడడంతో ఊపిరి తీసుకోవడం సమస్యగా మారిందని ఆ వర్గాలు తెలిపాయి. త్వరలోనే లతా మంగేష్కర్ పూర్తిగా కోలుకుని ఇంటికి రాగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. మరికొన్ని రోజుల్లోనే ఆమె ఇంటికి వస్తారని మరో సమీప బంధువు వెల్లడించారు.