జాతీయ వార్తలు

సరయూకు భక్త ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య, నవంబర్ 12: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం అయోధ్యలో సరయూ నది తీరంలో లక్షలాది మంది పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వచ్చిన మొట్టమొదటి పవిత్ర దినం కార్తీక పౌర్ణమి కావడంతో ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి సరయూ నది తీరంలో పుణ్యస్నానాలు చేశారు. అయితే, అయోధ్యలో ఎక్కడ చూసినా భద్రతను కట్టుదిట్టం చేయడంతో పూర్తి ఆంక్షల మధ్యే భక్తులు కార్తీక పౌర్ణమిని జరుపుకొన్నారు. సరయూ నది తీరంలోని ప్రతి ఘాట్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయోధ్యలో ఎక్కడ చూసినా ‘శ్రీరామ్’ నామస్మరణతో మార్మోగింది. అయోధలో రామజన్మభూమికి అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో పలువురు భక్తులు తమ మనోభావాలను ఈ సందర్భంగా పాలు పంచుకొన్నారు. గోరఖ్‌పూర్ జిల్లా నుంచి వచ్చిన ఓ రైతు మాట్లాడుతూ ‘గత 20 సంవత్సరాలుగా కార్తీక పౌర్ణమి పుణ్యస్నానం కోసం ఇక్కడికి వస్తున్నాను.. ప్రస్తుత పుణ్యస్నానం పూర్తిగా భక్తి ప్రపత్తులతో కూడినది.. అందుకే ఇక్కడికి వచ్చాను.. ఈసారి మరింత ప్రత్యేకతతో కూడినది.. కోర్టు రాముడికి అనుకూలంగా తీర్పు వెలువరించడం చాలా సంతోషదాయకం.. అందుకే ఇక్కడికి వచ్చి తెల్లవారు ఝామున రెండు గంటలకే పుణ్య స్నానం చేశా’ అని పేర్కొన్నాడు. ‘అయోధ్యకు ప్రస్తుతం వెళ్లవద్దని ఎంతోమంది చెప్పినప్పటికీ రామజన్మభూమి తీర్పు వచ్చిన నేపథ్యంలో కచ్చితంగా ఇక్కడికి రావాలని నిర్ణయించుకొని సరయూలో స్నానం చేశాను’ అంటూ గోండా నుంచి ఇక్కడికొచ్చిన సతీష్‌పాండే అనే 55 సంవత్సరాల భక్తుడు పేర్కొన్నాడు. మా గ్రామస్థులు అయోధ్యకు రావడానికి ఒప్పుకోలేదు.. ఇక్కడ భద్రత చాలా ఎక్కువగా ఉంది.. ఈ సమయంలో అక్కడికి వెళ్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంటూ నాకు చెప్పినప్పటికీ రాముడిపై నాకున్న అచంచల విశ్వాసంతో ఇక్కడికి వచ్చి సరయూలో స్నానం చేసి తరించానంటూ మరో రైతు పేర్కొన్నాడు. ఈసారి ఎలాగైనా ‘ప్రభు శ్రీరాం’ ఆశీస్సులు ఎలాగైనా పొందాలన్న పట్టుదలతో ఎంతగా అయోధ్యలో ఆంక్షలున్నా ఇక్కడికి చేరుకోగలిగానంటూ మరొక భక్తుడు పేర్కొన్నారు. ‘‘నా రక్షకుడు ఆ శ్రీరాముడే’ అందుకే నాకు ఎలాంటి భయం లేదు వివాదాస్పదంగా మారిన రామజన్మభూమి వివాదానికి ఎట్టకేలకు పరిష్కారం లభించిన తరుణంలో ఎలాగైనా కార్తీక పౌర్ణమికి రావాలనుకొని వచ్చాను’ అంటూ మరో భక్తుడు వెల్లడించారు.
భద్రత కట్టుదిట్టం
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా ప్రభుత్వం భద్రతను కార్తీక పౌర్ణమి రోజు మరింత కట్టుదిట్టం చేసింది. ఘాట్‌ల పొడవునా ఎక్కడికక్కడ బలగాలను మోహరింపజేశారు. చెక్‌పోస్టులు యథావిధిగా తనిఖీ నిర్వహించినప్పటికీ ఫోర్ వీలర్లను అనుమతించకపోవడంతో చాలామంది టూవీలర్లపైనే అయోధ్యకు వచ్చిన పుణ్యస్నానాలు ఆచరించారు. అయోధ్యకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఫైజాబాద్ వైపు అల్లర్లు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. తీర్పు నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుంచే ఇక్కడ భద్రత కొనసాగుతోంది అని పోలీసు వర్గాలు తెలిపాయి. మరో వారం రోజులపాటు ఈ భద్రత ఉంటుందని పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి దృష్టిలో ఉంచుకొని నిఘాను మరింత ఎక్కువ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బరాబంకి, సుల్తాన్‌పూర్, గొండా, బహ్‌రైచ్ పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఇక్కడి ఘాట్‌లన్నీ పుణ్యస్నానాలు చేసే వారితో కిటకిటలాడాయి. అయోధ్య డివిజన్‌కు చెందిన సమాచార శాఖ డైరెక్టర్ మురళీధర్ సింగ్ మాట్లాడుతూ భక్తుల కోసం సరయూ తీరంలో విస్తృత ఏర్పాట్లు చేశామని.. సరిపడినంతగా నదిలో నీరు ఉండడంతో ఎలాంటి ఇబ్బంది కలుగలేదని చెప్పారు. సోమవారం సాయంత్రం 5.34 నుంచి మంగళవారం సాయంత్రం 6.42 గంటల వరకు పుణ్యస్నానాలకు మంచి సమయం కావడంతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన పుణ్యస్నానాలు చేశారని ఆయన వివరించారు. లక్షలాది భక్తులు వస్తారని ముందే అంచనా వేసి ఆమేరకు ఏర్పాట్లను చేశామని ఆయన పేర్కొన్నారు. సరయూ తీరంలో నాలుగు ఘాట్‌లున్నాయనీ.. ఒక్కో ఘాట్‌ను 20 సెక్టార్లుగా విభజించి మొత్తం 80 సెక్టార్లలో ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పుణ్యస్నానాలు ఆచరించగలిగారని స్పష్టం చేశారు.
*చిత్రం... కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం అయోధ్యలోని సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు