జాతీయ వార్తలు

టీఎన్ శేషన్‌కు అంతిమ వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 11: గుండెపోటుతో మరణించిన కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ (సీఈసీ) టీఎన్ శేషన్‌కు సోమవారం కుటుంబ సభ్యులు, అభిమానులు అంతిమ వీడ్కోలు పలికారు. ఇక్కడి బసంత్ నగర్‌లోని శ్మశాన వాటికలో ఎలక్ట్రిక్ పరికరం ద్వారా అంత్యక్రియలు పూర్తి చేశారు. 86 సంవత్సరాల శేషన్‌కు ఆదివారం ఉదయం 9.45 గంటలకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అయినా శేషన్ తుది శ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం శేషన్ భౌతికకాయానికి కుటుంబ సభ్యులు వారి ఆచారం ప్రకారం అంతిమ యాత్రకు కావాల్సిన ఏర్పాట్లు నిర్వహించారు. అల్వార్‌పేటలోని ఆయన స్వగృహానికి బంధు, మిత్రులు, అభిమానులు చేరుకుని నివాళి అర్పించారు. డీఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్, ఎఐడీఎంకె సీనియర్ నాయకుడు, మత్స శాఖ మంత్రి డి. జయకుమార్, కేంద్ర మాజీ మంత్రులు రాధాకృష్ణన్, జీకే వాసన్ ప్రభృతులు శేషన్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఇంకా డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్ తదితరులు శేషన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం శ్మశాన వాటికకు తీసుకెళ్ళారు.
కాంగ్రెస్ నివాళి
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి టీఎన్ శేషన్ మృతికి పలువురు కాంగ్రెస్ నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు. శేషన్ తీసుకున్న నిర్ణయాలు ఎన్నికల కమిషన్‌కు వనె్నతెచ్చాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఓ సందేశంలో పేర్కొన్నారు. కేబినెట్ కార్యదర్శి నుంచి అన్నింటా ఆయన ధైర్యంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేశారని ఆమె ప్రస్తుతించారు. ‘శేషన్ సేవలు చిరస్మరణీయం. ఎన్నికల కమిషన్ అంటే ఏమిటో చూపించారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చారు’అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. శేషన్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ ప్రగాఢ సానుభూతి తెలుపుతోందని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. ‘కేంద్ర ఎన్నికల సంఘంలో మీరు తీసుకొచ్చిన సంస్కరణలు ఎంతో గొప్పవి. సంస్థ పటిష్టానికి మీరెంతో కృషి చేశారు’ సుర్జేవాలా హందీలో ట్వీట్ చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కాంగ్రెస్ సీనియర్లు జైరాం రమేష్, జ్యోతిరాధిత్య సింధి యా, మిలింద్ దేవరా తదితరులు శేషన్ మృతికి నివాళి తెలిపారు. అలాగే హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ దివంగత శేషన్‌కు నివాళి తెలిపారు.