జాతీయ వార్తలు

తెలంగాణ రెండు సంస్థలకు నైపుణ్యాభివృద్ధి అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: తెలంగాణలోని రెండు సంస్థలకు జాతీయ స్థాయిలో అవార్డులు లభించాయి. గిరిజన ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్న ట్రైబల్ మంత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు తయారు చేస్తున్న బొల్లాట్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలకు జాతీయ వ్యవస్థాపక అవార్డులు దక్కాయి. శనివారం కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ నేతృత్వంలో ఢిల్లీలో ఒక కార్యక్రమం జరిగింది. ఆ శాఖ మంత్రి మహేంద్ర పాండే చేతుల మీదుగా బొల్లాట్ వ్యవస్థాపకుడు బొల్లా శ్రీకాంత్, ట్రైబల్ మంత్ర వ్యవస్థాకుడు సురేష్ నాయక్, రమావత్, లీలావతి, లక్ష్మీరామ్ ఎస్సీ ఎస్టీ విభాగంలో అవార్డులను అందుకోవడంతోపాటు, ఐదు లక్షల చెక్కును అందుకున్నారు. వ్యవస్థాపక అభివృద్ధిలో అత్యుత్తమ సేవలు, పర్యావరణ అనుకులంగా కార్యక్రమాలు చేపడుతున్న యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఈ అవార్డులు అందజేసింది.