జాతీయ వార్తలు

హజ్ కోటా పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: తెలంగాణ నుండి హజ్‌కు వెళ్లే యాత్రికుల కోటా పెంచాలని కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లాను కోరినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఆయన సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాల చారి, రామచంద్రు తేజావత్‌లతో కలసి నజ్మా హెప్తుల్లాను కలిశారు. తెలంగాణాకు ప్రస్తుతం 2,530 మందికి మాత్రమే హజ్‌కు వెళ్లేందుకు అవకాశం ఇస్తున్నారనీ, దరఖాస్తులు మాత్రం 17 వేలు వస్తున్నాయని అలీ చెప్పారు. హజ్ యాత్రికుల కోటా పెంచాలని కోరుతూ ఇంతవరకు నాలుగు సార్లు కేంద్రానికి వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి ఫలితం కనిపించలేదని ఆయన వాపోయారు. 17వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఇందులో నుండి కేవలం 375 మందిని డ్రాలో ఎంపిక చేయటం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. కాగా ప్రధాన మంత్రి, ఉప రాష్టప్రతి, విదేశాంగ శాఖ మంత్రి, మైనారిటీ శాఖ మంత్రుల కోటా నుండి దాదాపు వెయ్యి మందికి సహాయం చేస్తామని నజ్మా హెప్తుల్లా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. మైనారిటీలకు సంబంధించిన ఉన్నత విద్యా సంస్థల గురించి కూడా కేంద్ర మంత్రితో చర్చించినట్లు మహమూద్ అలీ చెప్పారు. బిద్రీ కళకు చేయూత ఇవ్వవలసిందిగా కేంద్రాన్ని కోరానన్నారు.

చిత్రం సోమవారం ఢిల్లీలో కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి
నజ్మా హెప్తుల్లాకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ