జాతీయ వార్తలు

కేదార్‌నాథ్‌లో ఫడ్నవిస్ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, అక్టోబర్ 23: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆయన భార్య అమృతతో కలసి కేదార్‌నాథ్ ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయానికి ఫడ్నవిస్ వెళ్లినట్టు ఉత్తరప్రయాగ జిల్లా మేజిస్ట్రేట్ మంగేష్ దీలియాళ్ ధృవీకరించారు. అయితే, ఇది వ్యక్తిగత పర్యటన కాబట్టి జిల్లా స్థానిక యంత్రాంగానికి ఎలాంటి సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, దేవేంద్ర ఫడ్నవిస్, అమృత దంపతులు కేదార్‌నాథ్‌లో పూజలు నిర్వహించినట్టు బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ అధికారులు ప్రకటించారు. ప్రధాన అర్చకులు వారితో పూజలు చేయించినట్టు తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సోమవారం జరిగిన విషయం తెలిసిందే.
*చిత్రం... కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, ఆయన భార్య అమృతా ఫడ్నవిస్