జాతీయ వార్తలు

ప్రమాణాలు పాటిస్తే కాలుష్యం తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరినప్పటికీ, కొన్ని ప్రమాణాలు పాటిస్తే దానికి అడ్డుకట్ట వేయవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత పదేళ్ల కాలంలో అనుసరిస్తున్న వివిధ విధానాల వల్ల ఢిల్లీలో కాలుష్యం 25 శాతం తగ్గిందని సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమితారాయ్ చౌదరి తన నివేదికలో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రవేశపెట్టడం, కాలం చెల్లిన వాహనాలు రోడ్డుపైకి రాకుం డా జాగ్రత్తలు తీసుకోవడం, బాణసంచా కాల్చడంపై పరిమితులు విధించడం, పారిశ్రామికవాడల నుంచి వచ్చే రసాయన ఉద్గారాలు వ్యాపించకుండా చూడడం వంటి అనేక చర్యల ఫలితంగా ఢిల్లీలో వాతావరణం 25 శాతం పెరిగిందని ఆమె తన నివేదికలో తెలిపారు. అయితే, ఇది సరిపోదని, ఢిల్లీలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనాలంటే మరో 65 శాతం వరకు వాయు కాలుష్యం తగ్గాలని పలువురు నిపుణులతో కలసి చేసిన అధ్యయన నివేదికలో ఆమె పేర్కొన్నారు. ఇది సులభ సాధ్యం కాకపోయినా అసాధ్యం మాత్రం కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్గారాలను వెదజల్లే పరిశ్రమలను నియంత్రించడంతోపాటు పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే కారకాలను గుర్తించి, వాటిని నిలుపుదల చేయడం ద్వారా కాలుష్య శాతాన్ని తగ్గించవచ్చునని ఆమె అన్నారు.

*చిత్రం...ఢిల్లీలో దట్టంగా పొగ కమ్ముకున్నట్టు స్పష్టం చేస్తున్న నాసా విడుదల చేసిన చిత్రమిది. దేశ రాజధానిలో
వాతావరణ కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే గత ఏడాది దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు పరిమితులను విధించింది. మరోసారి అలాంటి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది