జాతీయ వార్తలు

చివరి శ్వాస తీసుకుంటున్న కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైన, అక్టోబర్ 16: మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ చివరి శ్వాస తీసుకుంటున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ‘పరివార్ భక్తి’లో ‘దేశ భక్తి’ని చూసుకుంటున్నదని ఆయన దుయ్యబట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వివిధ ప్రాంతాల్లో ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. జైనా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ను తూర్పార బట్టారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాడు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ కాదని, ఇప్పుడు కేవలం కుటుంబ భక్తి పార్టీగా మారిందని విమర్శించారు. మహారాష్ట్రలోని కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలన్నీ ఇప్పుడు తుది శ్వాస తీసుకుంటున్నాయని అన్నారు. దేశ ప్రజల అభీష్టం మేరకు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చామని ఆయన తెలిపారు. అధికారంలోకి వస్తే 370-అధికరణను పునరుద్ధరిస్తామని చెప్పగలరా? అని ఆయన ప్రతిపక్షాల నేతలను ప్రశ్నించారు. తమ నిర్ణయంతో జమ్మూ-కాశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని ఆయన తెలిపారు. మరట్వాడ ప్రజలు ఇప్పటి వరకు ముగ్గురు ముఖ్యమంత్రులను ఇచ్చినా ఆ ప్రాంతం ఇంకా వెనకబడే ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు.

*చిత్రం...ప్రధాని నరేంద్ర మోదీ