జాతీయ వార్తలు

చిదంబరంతో సోనియా, మన్మోహన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరంను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం పరామర్శించారు. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కాంగ్రెస్ నేతల వెంట ఉన్నారు. తనను చూడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రావడంతో చిదంబరం సంతోషం వ్యక్తం చేశారు. ‘సోనియా, మన్మోహన్ రావడం నేను గౌరవంగా భావిస్తున్నాను. కాంగ్రెస్ ధైర్యంగా, బలంగా ఉంటే నేనూ ధైర్యంగా ఉంటా’అని చిదంబరం ట్వీట్ చేశారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం చిదంబరాన్ని ఈనెల 5న కస్టడీకి తీసుకున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై మాజీ కేంద్ర మంత్రి వ్యంగ్యోక్తులు చేశారు. ‘మీరు ఎలా ఉన్నారని అడిగితే..్భరత్ అంతా బావుంది’అని మోదీ చెప్పడాన్ని చిదంబరం తప్పుపట్టారు. హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమం ప్రధాని తన గొప్పలను చెప్పుకోవడానికే అన్నట్టు ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ‘దేశంలో నిరుద్యోగ సమస్య జఠిలంగా మారింది. ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. కనీస వేతనాలు అందని పరిస్థితి ఉంది. మూకదాడులకు యథేచ్ఛగా సాగుతున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పెట్టారు’అని చిదంబరం నిప్పులు చెరిగారు. ఇవన్నీ మరుగున పరుస్తూ ‘మీరెలా ఉన్నాంటే దేశమంతా బావుందని చెప్పడం’ విడ్డూరంగా ఉందని మాజీ ఆర్థిక మంత్రి ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మా నాన్నను చూడడానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా కుటుంబానికి కాంగ్రెస్ అండంగా ఉంది’అని కార్తీ చిదంబరం స్పష్టం చేశారు. ‘సోనియాజీ, మన్మోహన్‌జీ మా నాన్నను పరామర్శించారు’అని ఓ మీడియా సంస్థతో కార్తీ చెప్పారు. కాగా చిదంబరం న్యాయపోరాటానికి సోనియా సంపూర్ణ మద్దతు తెలిపారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే కార్పొరేట్ పన్ను కోత, జీఎస్‌టీలో మినహాయింపుఅంశాలపై వారు చర్చించినట్టు తెలిసింది. దేశంలో ఆర్థిక పరిస్థితిపై నేతలు చర్చించినట్టు చెబుతున్నారు. చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై సోనియా, మన్మోహన్ ఆరా తీశారు. కాగా కాంగ్రెస్ అవినీతిని పెంచిపోషించారన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ నిప్పులు చెరిగారు. ఎవరు అవినీతిపరులో, ఎవరు అమాయకులో తేల్చేది న్యాయస్థానాలేనని ఆయన అన్నారు. కాగా కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ గత వారం తీహార్ జైలుకొచ్చి చిదంబరాన్ని పరామర్శించారు.