జాతీయ వార్తలు

నేడు వెదిరె శ్రీరామ్ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: రాజస్థాన్ రాష్ట్రంలో నీటి కొరతను తీర్చడానికి, నీటి వనరులను పెంచడానికి వివిధ యూనిట్లుగా తీసుకుని నదీ పరీవాహక ప్రాంతాలలో నీటి నిర్వహణ చేపట్టినట్టు ప్రముఖ నీటి పారుదల రంగ నిపుణుడు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ పేర్కొన్నారు. రాజస్థాన్ సాధించిన ఫలితాలు, ఎదురైన అవరోధాలతో కూడిన (విలక్షణమైన నీటి నిర్వహణ కథ-రాజస్థాన్ పద్ధతి) పుస్తకంలో వివరించినట్టు ఆయన చెప్పారు. ఢిల్లీలో శ్రమశక్తి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజస్థాన్ నీటి నిర్వహణపై ఈ పుస్తకంలో వివరించినట్టు చెప్పారు. ఈ పుస్తకాన్ని గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవడేకర్, గజేంద్రసింగ్ షెకావత్, కిషన్‌రెడ్డి, రతన్‌లాల్ కఠారియా ఆవిష్కరించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ రాష్ట్రం సీఎం జల స్వావలంబన్ పథకంతో అనేక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు.