జాతీయ వార్తలు

ప్లాస్టిక్‌ను నిషేధించి ప్రపంచానికి ఆదర్శం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్లాస్టిక్ వినియోగాన్ని భారత్ ప్రజలు పూర్తిగా నిషేధించి ప్రపంచానికి ఆదర్శం కావాలని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మ దినోత్సవం సందర్భంగా మంగళవారం సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి మంత్రి షేకావత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని స్వచ్ఛ దివస్‌గా పాటించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షేకావత్ ప్రసంగిస్తూ ప్లాస్టిక్ వినియోగం ప్రపంచ దేశాలను వణికిస్తున్నదన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత దేశ వారసత్వాన్ని పునరుద్ధరించడం ద్వారా ప్రధాని మోదీ ఘనత ప్రపంచ దేశాల ప్రజలకు తెలిసిందన్నారు. అనేక సందర్భాల్లో పలు దేశాలకు భారత్ ఆశా కిరణంలా కనిపించిందన్నారు. బ్రిటీష్ పాలకులను పారదోలేందుకు జరుగుతున్న స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టి 1947లో దేశానికి స్వాతంత్య్రం సంపాదించుకున్నామన్నారు. ఈ సంగ్రామం ప్రపంచ దేశాలను ఆకర్షించిందన్నారు. అంతేకాదు ఆ తర్వాత 25 ఏళ్ళలోనే దాదాపు అనేక దేశాలు స్వతంత్ర దేశాలు కావడానికి మార్గదర్శకులం అయ్యాయని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం విషయంలోనూ స్వాతంత్య్ర పోరాటం తరహాలో చేసినట్లయితే ప్రపంచ దేశాలకు మార్గదర్శకులం అవుతామని కేంద్ర మంత్రి షేకావత్ అన్నారు. సులభ్ శానిటేషన్, సాంఘిక సంస్కరణల ఉద్యమ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాథక్ ప్రసంగిస్తూ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం చారిత్రక నిర్ణయం అని పాతక్ అభివర్ణించారు.