జాతీయ వార్తలు

ఉగ్ర భూతమే పాక్‌ను మింగేస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంపూర్, సెప్టెంబర్ 16: ఏ ఉగ్రవాదాన్నయితే పాకిస్తాన్ పెంచి పోషిస్తుందో అదే ఉగ్రభూతం ఆదేశాన్ని మింగేస్తుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో సోమవారం ‘రాష్ట్రీయ ఏక్తా అభియాన్’ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ‘సొంత భూభాగాన్ని ఉగ్రవాదులకు అప్పగించింది. ఏదో రోజు ఆ ఉగ్ర స్నేహితులే పాక్‌ను నాశనం చేస్తారు’అని అన్నారు. భారతీయ ముస్లింల దేశభక్తిని శంకించలేమని నఖ్యీ పేర్కొన్నారు. అల్ ఖైదా, ఐఎస్‌ఐఎస్ దేశంలో తిష్టవేయడానికి విఫలయత్నం చేశాయని ఆయన వెల్లడించారు. భారతీయ ముస్లింల జాతీయత, దేశ భక్తి గొప్పదని, అందువల్లే అంతర్జాతీయ ఉగ్రవాదుల కుట్రలు పారలేదని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. పాక్ ఉగ్రవాదుల అన్ని ప్రయత్నాలనూ దేశంలోని ముస్లింలు తిరస్కరిస్తునే ఉన్నారని ‘్భరతీయ ముస్లింలు శాంతి కాముకులు. సహోదర ప్రేమ, మానవత్వం నిండిన వారు’అని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్రీయ ఏక్తా అభియాన్ కార్యక్రమంపై మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఉగ్రవాద భూతమే పాక్‌ను నాశనం చేస్తుంది. గతంలో అనేక ఉదంతాలు ఉన్నాయి’అని మంత్రి చెప్పారు. ఉగ్రవా సంస్థలు, ఉగ్రవాదుల నుంచి తప్పించుకోడానికి పాక్ పడరాని పాట్లు పడుతోందన్న మంత్రి ఏకంగా ఇస్లాంకే ప్రమాదం ముంచుకొచ్చిందని నఖ్వీ తెలిపారు. పాకిస్తాన్ తీరుతో ప్రపంచ శాంతి, మానవత్వానికి ప్రమాదం ఏర్పడిందని ఆయన అన్నారు. భారత్ వైఖరి ఏమిటో ప్రపంచ దేశాలకు అర్థమైందని మైనారిటీ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. అన్ని దేశాలు ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నది పాకిస్తానే అని తెలుసుకున్నాయని ఆయన వివరించారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ఉపయోగించుకుని పాక్ ప్రేరిత తీవ్రవాదులు, వేర్పాటు వాదులు రాష్ట్రంలో శాంతికి విఘాతం కల్పించేవారని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 370 తీవ్రవాదులు, వేర్పాటువాదులు ఓ ఆయుధంగా వాడుకున్నారన్న నఖ్వీ ‘నరేంద్ర మోదీ ప్రభుత్వం వాళ్ల ఆటలకు చెక్‌పెట్టారు’అని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా జమ్మూ,కాశ్మీర్, లడఖ్ సర్వతోముఖాభివృద్ధికి మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
*చిత్రం... కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ