జాతీయ వార్తలు

‘ఇషత్ పత్రాల’ అదృశ్యంపై హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: వివాదాస్పద ఇషత్ జహాన్ ‘బూటకపు ఎన్‌కౌంటర్’ కేసుకు సంబంధించిన పత్రాలు అదృశ్యం కావడంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య ఈ అంశంపై చోటు చేసుకుంటున్న పరస్పర విమర్శలు తాజా చర్యతో మరింత పెరగనున్నాయి. హోంమంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న అండర్ సెక్రటరి ఒకరు పత్రాల అదృశ్యంపై ఇక్కడి పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో విశ్వాస ఘాతుకానికి పాల్పడి ఈ పత్రాలను మాయం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొంటూ, ఎందుకు? ఎలా? ఏ పరిస్థితుల్లో ఈ పత్రాలు మాయం అయ్యాయో దర్యాప్తు చేయాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భారత శిక్షాస్మృతి (ఐపిసి)లోని సెక్షన్ 409 కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2009 సెప్టెంబర్ 18-28 తేదీల మధ్య ఈ పత్రాలను తెలిసి కాని తెలియకుండా కాని ఎవరో తీసివేయడమో లేక పత్రాలు దొరకకుండా పోవడమో జరిగిందని ఈ అంశంపై విచారణ జరిపిన అదనపు కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
యుపిఎ ప్రభుత్వ హయాంలో ఈ పత్రాలు అదృశ్యమైన సమయంలో పి.చిదంబరం హోంమంత్రిగా ఉన్నారు. హోంమంత్రిత్వ శాఖనుంచి అదృశ్యమైన అయిదు పత్రాలలో కేవలం ఒక్క పత్రం మాత్రమే తరువాత దొరికిందని విచారణ కమిషన్ పేర్కొంది. మూడు నెలలపాటు విచారించిన ఈ కమిటీ జూన్ 15న తన నివేదికను సమర్పించింది. అయితే ఈ కమిషన్ తన నివేదికలో చిదంబరం పేరును కాని అప్పటి యుపిఎ ప్రభుత్వంలోని మరెవరి పేరును కాని ప్రస్తావించలేదు. హోంమంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదు మేరకు ఆ శాఖలో పత్రాలు చోరీకి గురయినట్లు పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఈ నెల 22న కేసు నమోదు చేశారు.