జాతీయ వార్తలు

రైల్వే బడ్జెట్ విలీనంపై పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనతోపాటుగా, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను కూడా పరిశీలించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. రైల్వే శాఖకు విడిగా బడ్జెట్‌ను సమర్పించే సంప్రదాయం 92 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అయితే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చి, పథకాలపై ఖర్చును వేగవంతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను విలీనం చేసి ఒకే బడ్జెట్‌ను సమర్పించడంతోపాటుగా బడ్జెట్ సమర్పణను నెల రోజులు ముందుకు జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది కూడా. అయితే రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు అంశాన్ని పరిశీలించాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించినట్లు ఈ నెల 22న విడుదల చేసిన లోక్‌సభ బులెటిన్ తెలియజేసింది. బడ్జెట్ ప్రక్రియను సులభతరం చేయడానికి బడ్జెట్ వ్యయాన్ని ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయంగా విడివిడిగా చూపించే పద్ధతికి స్వస్తి చెప్పాలని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పటివరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 3వ వారంలో ఏర్పాటు చేస్తుండగా నెల రోజులు ముందుగానే అంటే జనవరి 25వ తేదీకన్నా ముందే ఏర్పాటు చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. కాగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఈ ప్రతిపాదనలను లోతుగా పరిశీలించాలని నిర్ణయించింది. రెండు బడ్జెట్‌లను విలీనం చేయడాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కేవలం కంటితుడుపు చర్యగా అభివర్ణించిన తర్వాత ఈ చర్యను లోతుగా పరిశీలించాలని కమిటీ నిర్ణయించింది. బడ్జెట్‌తో పాటుగా ఈ కమిటీ డిజినె్వస్ట్‌మెంట్ విధానం, దేశంలో బ్యాంకింగ్ రంగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పాత్ర, దాని విధానం అంశాలను కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే సెక్యూరిటీస్, ఎక్స్‌చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డిఏ) తదితర రెగ్యులేటరీ వ్యవస్థల పని తీరును కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది.