జాతీయ వార్తలు

ఇరాక్‌లో చిక్కుకున్నతెలుగువారిని ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: ఇరాక్‌లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించి, వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ‘గల్ఫ్ తెలంగాణ సంస్థ’ప్రతినిధి బసంతరెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం నాడు ఢిల్లీలో బంసంతరెడ్డి విలేఖరులతో మాట్లాడారు. ఏజెంట్ల మోసాలతో, వీసా సమస్యలతో ఇరాక్‌లోని ఏరిబిల్ ప్రాంతంలో రెండు రాష్ట్రాలకు చెందినవారు చిక్కుకున్నారని చెప్పారు. వీసా గడువు పూర్తయి, పనిలేక, తిండిలేక సుమారు 800 మందికి పైగా అక్కడ చిక్కుకొని దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారని పేర్కొన్నారు. వారిని ఇండియాకు పంపడానికి 1500 డాలర్లు చెల్లించాలని అక్కడ అధికారులు డిమాండ్ చేస్తున్నట్లు బసంతరెడ్డి తెలిపారు. దీనిపై కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు చొరవ చూపాలని ఆయన కోరారు.