జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, సెప్టెంబర్ 24: చత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ చనిపోయారు. జగదల్‌పూర్ జిల్లాలోని బుర్గుం పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఐజి కల్లూరి ఆదేశాల మేరకు బస్తర్ ఎస్పీ ఆర్‌ఎన్ దాస్ ఆధ్వర్యంలో డిఆర్‌జి, డిఏఎఫ్, సిఏఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. సాగుఏల్ గ్రామం వద్ద మావోయిస్టులు వీరిని చూసి ఫైరింగ్ ప్రారంభించారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. సుమారు గంటకు పైగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పులు జరుపుకుంటూ ఇంద్రావతి నది పక్క నుంచి గుట్టల్లోకి మావోయిస్టులు పారిపోయారు. ఘటనాస్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటుగా భారీ సంఖ్యలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒకరిని బార్సూరు ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది.
బస్తర్ ఐజికి ప్రశంసలు
కాగా బస్తర్ ఐజి కల్లూరిపై జాతీయ భద్రతా సలహాదారు కె.విజయ్‌కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 22 వరకు అబూజ్‌మడ్ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించడంలో బస్తర్ పోలీసులు జట్టుగా మంచిగా పనిచేశారని, ఇలాగే కొనసాగించాలంటూ లేఖ రాశారు. ఈ మధ్య కాలంలో 91 మంది మావోయిస్టులు హతమయ్యారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఫలితాలు రాలేదని, మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లోనూ ఎదురుదాడి చేసి ఉత్సవాలను భగ్నం చేశారని ప్రశంసించారు.