జాతీయ వార్తలు

మోదీని పొగిడే వారిని సాగనంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ప్రధాని నరేంద్ర మోదీ భారతావనిని రాక్షస భూమిగా మారుస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేకే తివారి ధ్వజమెత్తారు. మోదీ పాలనను పొగుడుతున్న జైరాం రమేశ్, అభిషేక్ సింఘ్విలాంటి వారిని సాగనంపాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు. ప్రజల మద్దతుతో మోదీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో ఫాసిజాన్ని మోదీ పాదుకొల్పుతున్నారని పేర్కొన్న తివారి ‘ఎవరు కూడా జన్మతః దేవతా కాదు రాక్షసులూ కారు, వారి శరీరాన్ని బట్టే ఇది ఆధారపడి ఉంటుంది కానీ నేడు భారతావనే రాక్షస భూమిగా మారుతోంది’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని, వీరిలో ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదని రాజ్యసభ ద్వారానే పదవులు పొందిన నాయకులని తివారి అన్నారు. మోదీకి అనుకూలంగా ప్రకటన చేస్తున్న వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన సోనియాకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా జైరాం రమేశ్‌పై తీవ్రంగా విరుచుకుపడిన ఆయన అధికారాన్ని పట్టుకుని వేలాడే వ్యక్తిగా ఆయన్ను అభివర్ణించారు. అలాగే శశిథరూర్ తెలివైన వాడు, ప్రతిభ ఉన్న వ్యక్తి అయినప్పటికీ ‘ప్రతిసారి ఆయనే పెళ్ళికొడుకు కావాలని అనుకుంటాడు..’ అని తివారి విరుచుకుపడ్డారు. ఇక సింఘ్వి విషయానికి వస్తే ఏమి మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడి ఉండవచ్చని అన్నారు. మోదీ ప్రభుత్వ పాలనపై తీర్పు ఇవ్వాల్సింది ప్రజలేనని ఆయన దేవుడా, రాక్షసుడా? అనేది తేల్చాల్సిందీ వారేనని తివారి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సిద్ధాంతాలను ఒప్పుకోని వారిపై జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని, రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ, ఆదాయం పన్నుల విభాగం అధికారులతో దాడులు చేయిస్తున్నారని తివారి విమర్శించారు.