జాతీయ వార్తలు

విపక్ష బృందం వెనక్కి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: జమ్మూకాశ్మీర్‌లో తాజా రాజకీయ పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు వెళ్లిన ప్రతిపక్ష పార్టీల నేతలకు చుక్కెదురైంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, అలాగే మరో 10 మంది విపక్ష నేతలను శనివారం శ్రీనగర్ విమానాశ్రయంలో దిగిన వెంటనే తిరిగి ఢిల్లీకి పంపేశారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన అనంతరం మాట్లాడిన రాహుల్ గాంధీ కాశ్మీర్‌లో పరిస్థితి ఎంతమాత్రం మామూలుగా లేదని, తమ బృందంతో వచ్చిన మీడియా ప్రతినిధులను కొట్టారని అన్నారు. అసలు కాశ్మీర్ ప్రజలు తాజా పరిణామాలపై ఏమనుకుంటున్నారు? వారి అభిప్రాయమేమిటో తెలుసుకోవడానికే తాము అక్కడకు వెళ్లామని, కానీ తాము విమానాశ్రయం దాటలేదని ఆయన తెలిపారు. కొన్ని రోజుల క్రితమే కాశ్మీర్ గవర్నర్ తమను ఆహ్వానించారని, దానిని కూడా తాము అంగీకరించానని తెలిపారు. ప్రతిపక్ష ప్రతినిధులను కాశ్మీర్‌లోకి అడుగుపెట్టనివ్వలేదంటూ అక్కడ పరిస్థితి మామూలుగా లేదన్న విషయం కళ్లకు కనబడుతోందని ఆయన అన్నారు. అసలు నరేంద్ర మోదీ ఏమి దాచాలనుకుంటున్నారో అర్ధం కావడం లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రకటనను జారీ చేసింది. 370 అధికరణ రద్దు తర్వాత కాశ్మీర్‌లో ఏమి జరుగుతోందో ఎవరికీ తెలియకుండా పోయిందని కాంగ్రెస్ తెలిపింది. రాజకీయ నాయకులు ఎవరు కూడా కాశ్మీర్ రావడానికి వీల్లేదని, వీరి పర్యటన వల్ల ప్రజలకు మరింత ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని కాశ్మీర్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. సీమాంతర ఉగ్రవాదం, ఇతర దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పిచేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో విపక్ష నేతలు రావడం వల్ల కొత్త సమస్యలు పుట్టుకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. అఖిలపక్ష బృందంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే నేతలు ఉన్నారు.
రాహుల్‌తోపాటు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ శ్రీనగర్ వచ్చారు. ఆజాద్‌ను ఇప్పటికే రెండుసార్లు జమ్మూ విమానాశ్రయం నుంచే వెనక్కి పంపేసిన విషయం తెలిసిందే. జమ్మూకాశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితికి విఘాతం కలిగించేందుకు తాము వెళ్లడం లేదని, తాము బాధ్యత కలిగిన రాజకీయ నాయకులమని ఆజాద్ తెలిపారు. గత 20 రోజులుగా కాశ్మీర్‌లో ఏమి జరుగుతోందో ప్రపంచానికి తెలిసే పరిస్థితి లేదని పేర్కొన్న ఆయన ‘అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. అలాంటపుడు కాశ్మీర్‌లో పర్యటించేందుకు మమ్మల్ని ఎందుకు అనుమతించడంలేదు’ అని ఆయన ప్రశ్నించారు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం చెప్పేదానికి, కాశ్మీర్‌లో వాస్తవ పరిస్థితికి ఎక్కడా పొంతన లేదని స్పష్టమవుతోందని ఆయన అన్నారు.