జాతీయ వార్తలు

భూకంప ప్రభావిత ప్రాంతంగా కోస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: భూకంప ప్రభావిత ప్రాంతాల మోడరెట్ డ్యామేజ్ రిస్క్‌జోన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి. దేశంలో ఎక్కడ భూకంపాలు వస్తాయో రాష్ట్రాల వారీగా గుర్తించి రూపొందించిన పటాలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం విడుదల చేశారు. దేశంలో భూకంప ప్రభావిత ప్రాంతాలను 4 జోన్‌లుగా విభజించారు. ఇందులో ముఖ్యంగా వెరి హై డ్యామెజ్ రిస్క్‌జోన్, హై డ్యామేజ్ రిస్క్‌జోన్, మోడరేట్ రిస్క్‌జోన్, లోడ్యామేజ్ రిస్క్ జోన్‌లుగా విభజించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆథారటీ, బిల్డింగ్ మెటీరియల్స్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ సంయుక్తంగా భూకంపాలను తట్టుకొనే విధంగా నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ఈ మ్యాప్‌లను తయారుచేసింది. వెరీ హై డ్యామేజ్ రిస్క్‌జోన్ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్‌లోని కచ్ ప్రాతం, ఉత్తరాఖండ్ రాష్ట్రం, పంజాబ్ రాష్ట్రంలోని ఉత్తరప్రాంతం, కాశ్మీర్‌లో కొంత భాగం ఈ రిస్క్‌జోన్‌లో ఉన్నాయి. హైడ్యామేజ్ రిస్క్‌జోన్‌లో హిమాలయ పర్వతాలను అనుకొని ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, పంజాబ్, హర్యానా జమ్మూకాశ్మీర్‌లతో పాటు ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ కూడా ఈ జోన్‌లో ఉంది.