జాతీయ వార్తలు

ఏకీకృత నియమావళి అమలు చేయాలి: ఎస్‌టియు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో ఏకీకృత సర్వీసు రూల్స్‌ను అమలు చేసి విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలని కేంద్రహోశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్ కుమార్‌కు తెలంగాణ రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టియు) నేతలు విజ్ఞప్తి చేశారు. ఎస్‌టియు అధ్యక్షుడు భుజంగరావు, ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన చేశారు. దశాబ్దాలుగా ఈ ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని దిలీప్‌కుమార్‌కు తెలిపారు. కాగా ఏకీకృత రూల్స్ అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వారన్నారు. కేంద్రం కూడా దీనికి సహకారం అందించాలని ఎస్‌టియు నేతలు కోరారు.