జాతీయ వార్తలు

అగ్రకులాల పేదలకూ 25 శాతం కోటా ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, సెప్టెంబర్ 20: అగ్రకులాల్లోని పేదలకు 25 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని దళిత నాయకుడు, కేంద్ర మంత్రి రాందాస్ అథావలే డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్‌ను ఎత్తివేసి, అదనంగా రిజర్వేషన్లు కల్పించాలని మంగళవారం ఇక్కడ సూచించారు. ‘అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నదానికి నేను మద్దతు ఇస్తాను. ఇప్పుడు అమలుచేస్తున్న 50 శాతం రిజర్వేషన్ల అమలుకు అదనంగా పాతికశాతం రిజర్వేషన్లు వారికి ఇవ్వాలి’ అని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం 50 శాతం కోటాను 75 శాతానికి పెంచాల్సి ఉంటుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి అథావలే డిమాండ్ చేశారు. అదనంగా 25 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల గుజ్జర్లు, పటేళ్లు, రాజ్‌పుట్స్, మరాఠీలు, జాట్‌లు, బ్రాహ్మణులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్లకు అదనంగా కల్పించే 25 శాతం కోటాకోసం రాజ్యాంగాన్ని సవరించాలని మంత్రి సూచించారు. అప్పుడు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవని అథావలే అభిప్రాయపడ్డారు.