జాతీయ వార్తలు

నడిరోడ్డుపై చంపేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశరాజధాని ఢిల్లీలో పట్టపగలే దారుణం జరిగింది. 21 ఏళ్ల ఓ అమ్మాయిని 34 ఏళ్ల ఉన్మాది ఒకడు అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. ఉత్తర ఢిల్లీలోని బురారీలో మంగళవారం ఉదయం 9గంటల ప్రాంతంలో కరుణ అనే అమ్మాయి నడిచి వెళ్తుండగా సురేందర్ సింగ్ అనే వ్యక్తి వెంబడించి కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా 22సార్లు ఆమెను కత్తితో పొడిచాడు. తనను తాను రక్షించుకోవటానికి కరుణ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అత్యంత కిరాతకంగా సురేందర్‌సింగ్ కత్తితో దాడి చేయటంతో కరుణ అక్కడికక్కడే మృతి చెందింది. కరుణను కాపాడటానికి ఒక వ్యక్తి ప్రయత్నించినప్పటికి అతనిపై కూడా దాడి చేసేందుకు హంతకుడు దూసుకురావటంతో అతను వెనక్కి తగ్గాడు. అయితే స్థానికులు హంతకుణ్ణి చుట్టుముట్టి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నావెల్ రీచెస్ స్కూల్‌లో కరుణ టీచర్‌గా పనిచేస్తున్నారు. హంతకుడు సురేందర్‌సింగ్ నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో కోచింగ్ కోసం కరుణ వెళ్లేది. కోచింగ్ సెంటర్‌లో కరుణను ప్రేమించాలంటూ సురేందర్ సింగ్ వెంటపడ్డాడు. ఏడాది కాలంగా సురేందర్‌సింగ్ ఆమెను వేధిస్తున్నాడు. ఆరు నెలల క్రితం బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో ఇరు కుటుంబాలు రాజీకి వచ్చాయి. అప్పటి నుంచి కరుణను సురేందర్‌సింగ్ వేధించటం ఆపేశాడు. చివరకు మంగళవారం ఒక్కసారిగా దాడి చేసి కరుణను దారుణంగా హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా తీవ్రంగా స్పందించారు. దేశరాజధానిలో మహిళలపై దాడులను నిరోధించటంలో ఢిల్లీ పోలీసులు తీవ్రంగా విఫలమయ్యారని, ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.