జాతీయ వార్తలు

స్మార్ట్ సిటీగా తిరుపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, ప్రధా ని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి సహా మొత్తం 27 స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించింది. వీటిలో వడోదర, ఆగ్రా, అజ్మీర్, నాగపూర్, గ్వాలియర్, థానె తదితర పట్టణాలున్నాయి. 27 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడానికి 66,883 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు మూడు దశలుగా 60 స్మార్ట్ సిటీలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఆవిధంగా మొత్తం 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ముఖ్య నగరాలు, పట్టణాలను స్మార్ట్‌సిటీల పరిధిలోకి తెచ్చింది. ఇంకా పలు రాష్ట్రాల్లో స్మార్ట్ సిటీలను ఎంపిక చేయాల్సి ఉంది. వీటిలో ఉత్తరాఖండ్, కాశ్మీర్ ఉన్నాయి. గరిష్ఠస్థాయిలో ఈ కొత్త జాబితాలో మహారాష్టక్రు ఐదు స్మార్ట్ సిటీలు లభించాయి. ఈ జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విడుదల చేశారు. వీటిల్లో తమిళనాడు, కర్నాటకలకు నాలుగు పట్టణాలు, ఉత్తరప్రదేశ్‌నుంచి నాలుగు పట్టణాలు, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్‌లనుంచి రెండు పట్టణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్ సిక్కింలకు ఒక్కో స్మార్ట్‌సిటీ లభించింది. మొత్తం 60 స్మార్ట్‌సిటీల అభివృద్ధికి లక్షా 44వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని పట్టణాభివృద్ధి శాఖ అంచనా వేసింది. ఇప్పటికే ఇందులో భాగంగా 82 ప్రాజెక్టులను చేపట్టామని అధికారులు తెలిపారు. స్మార్ట్‌సిటీ మిషన్‌లో భాగంగా ఒక్కో నగరానికి ఐదేళ్ల వ్యవధిలో 500 కోట్ల రూపాయలను కేంద్రం ఇస్తుంది. అంతే మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు సమకూర్చాల్సి ఉంటుంది. వీటిని రుణాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా సమకూర్చుకోవచ్చు.