జాతీయ వార్తలు

మోదీ రావణ పాలన అంతం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: కేంద్రంలో కొనసాగుతున్న రావణుడి పాలన అంతమొందించేందుకు శ్రీరాముడి వానరసైన్యం సిద్ధం కావాలని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీమంత్రి మణిశంకర్ అయ్యర్ తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ తరపున ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే రెండోరోజు మంగళవారం సర్పంచులకు, ఉప సర్పంచ్‌లకు నిర్వహించిన శిబిరానికి మణిశంకర్ అయ్యర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులకు చెక్ పవర్‌తో పాటు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2004లో తాను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్పంచ్‌లకు 10 అధికారాలు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించామని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ అధికారాలు కల్పించడం లేదన్నారు. 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ 10 అధికారాలు కల్పిస్తామని ప్రజలకు తెలియజేయాలని ఆయన టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సూచించారు. అప్పుడు తీసుకున్న నిర్ణయాల గురించి తెలుగులో ముద్రించి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు అందజేయాల్సిందిగా ఆయన సూచించారు.
బాబు బాటలో కెసిఆర్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని మణిశంకర్ అయ్యర్ మండిపడ్డారు. స్థానిక సంస్ధలకు నిధులు, విధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు. అంతకంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమం పేరిట స్థానిక సంస్ధల వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆయన విమర్శించారు. కాబట్టి కాంగ్రెస్ తిరిగి అధికారం చేపడితేనే స్థానిక సంస్ధలు బలపడతాయన్నారు. లోగడ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే స్థానిక సంస్ధల బలోపేతానికి రాజ్యాంగంలోని 73, 74 అధికరణాలను సవరించారని ఆయన చెప్పారు.
పార్టీ మారాలని ఒత్తిడి: ఉత్తమ్
టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ ప్రతిపక్షాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను పార్టీ మారాలని అధికార పార్టీ ఒత్తిడి తెస్తున్నదని విమర్శించారు. సర్పంచ్‌కు ఉన్న చెక్‌పవర్‌ను తీసేసి జాయింట్ చెక్‌పవర్‌గా మార్చారని ఆయన తెలిపారు. బిజెపి అంటే తమకు పడదని, మతతత్వ పార్టీ అని ఆయన విమర్శించారు.

చిత్రం.. గాంధీభవన్‌లో నిర్వహిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధుల శిక్షణ శిబిరంలో వేదికపై
ముచ్చటించుకుంటున్న ఎఐసిసి నేతలు మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్ సింగ్