జాతీయ వార్తలు

నాన్నకిచ్చిన మాటకోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గయ, సెప్టెంబర్ 20: ఓ పక్క కని పెంచిన తండ్రి పాక్ ముష్కరుల దాడిలో మరణించిన బాధ పెల్లుబుకుతున్నా ఆ కుమార్తెలు మాత్రం తండ్రికిచ్చిన మాటను ఆ బాధలోనూ నిలబెట్టుకున్నారు. కాశ్మీర్‌లోని ఉరీలో జరిగిన పాక్ మిలిటెంట్ల కాల్పుల్లో ఎస్.కె.విద్యార్థి అనే సైనికుడు మరణించాడు. ‘బాగా చదువుతామని, పరీక్షలు బాగా రాస్తామని మా నాన్నకు మాటిచ్చాం. అందుకే మంగళవారం జరిగిన పరీక్షలకు హాజరయ్యాం’ అని ఆరతి, అన్షు, హన్సిక అనే ఈ ముగ్గురు చిన్నారులు వెల్లడించారు. వీరిలో హన్సిక 2వ తరగతి చదువుతుండగా, ఆరతి 8వ తరగతి, అన్హు 6వ తరగతి చదువుతున్నారు. ఓ పక్క కన్నీళ్లు కారుతున్నా తండ్రి పోయిన దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఈ ముగ్గురు ఆడపిల్లలు ఎంతో సంయమనంతో పరీక్షలు రాయడం తమ హృదయాలను కరిగించిందని ఆ స్కూలు ప్రిన్సిపాల్ ఎ.కె.జనా తెలిపారు. తన తండ్రిని ఆగస్టు తర్వాత మళ్లీ చూడలేదని పరీక్ష రాసి బయటకు వచ్చిన ఆరతి తెలిపింది. అప్పుడే తన చదువు గురించి అడిగాడని, బాగా చదవమని చెప్పాడని గుర్తు చేసుకుంది. ఆయనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని, మిగతా ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఆరతి తెలిపింది.
ప్రభుత్వ మర్యాదలతో అంత్యక్రియలు
కానింగ్: ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువ సిపాయి బిశ్వజిత్ ఘరాయికి పూర్తి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిగాయి. 12 మంది సైనికులు తుపాకులు గాలిలోకి పేల్చి వందనం సమర్పిస్తున్న సమయంలో శ్రీ్ధరం గ్రామంలోని శ్మశాన వాటికకు వచ్చిన బిశ్వజిత్ తల్లి స్పృహ కోల్పోయింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి శోభన్ చటర్జీ త్రివర్ణ పతాకం చుట్టిన శవపేటికపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. 22 ఏళ్ల బిశ్వజిత్‌కు ఒక సోదరుడు, సోదరి ఉన్నారు.

చిత్రం.. ఉగ్రవాదం అంతం కావాలని ఆకాంక్షిస్తూ అజ్మీర్‌లో చిన్నారుల ప్రదర్శన