జాతీయ వార్తలు

గిరిజన యువతకు ఉపాధి కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర గిరిజన సంక్షేమశాఖ చర్యలు తీసుకోవాలని టిఆర్‌ఎస్ ఎంపీ సీతారాం నాయక్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర గిరిజన వ్యవహరాల శాఖ మంత్రి జ్యువెల్ ఓరంని కలిసి కోరారు. అక్టోబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తున్న జాతీయ గిరిజన కార్యక్రమంలో తెలంగాణ గిరిజనుల సంస్కృతి నృత్యాలు ప్రదర్శింపచేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. అలాగే తెలంగాణ గిరిజన సంక్షేమానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.