జాతీయ వార్తలు

బిర్యానీలో బల్లి ఉత్తిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: ‘బిర్యానీలో బల్లి’.. సంచలనం రేపిన ఈ ఉదంతాన్ని రైల్వే అధికారులు ఛేదించారు. కేవలం ఉచితంగా భోజనం చేయడానికే 70 సంవత్సరాల సీనియర్ సిటిజన్ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడని రైల్వే అధికారులు తేల్చేశారు. సోషల్‌మీడియాలో వైరల్ అయిన ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించిన రైల్వే అధికారులు సురేందర్ పాల్ అనే సీనియర్ సిటిజన్ గతంలో జబల్‌పూర్‌లో ‘సమోసాలో బల్లి’ని చూపి వివాదానికి తెర లేపాడని అధికారులు నిర్దారించారు. గుంతకల్ స్టేషన్‌లో బిర్యానీలో బల్లి ఉందని పాల్ అనే వ్యక్తి హల్‌చల్ చేయడంతో రైల్వే అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. వైరల్ అయిన వీడియోను గమనించిన జబల్‌పూర్ రైల్వే డీసీఎం ఇతను గత జూలై 14న సమోసాలో కూడా బల్లిని చూపి హడావుడి చేశాడని పేర్కొంటూ సదరు గుంతకల్ డివిజన్ అధికారులకు ఇతని ఫొటో సహా వివరాలు పంపారు. దర్యాప్తు జరుగుతున్న తరుణంలో విషయం తేలడంతో సదరు సీనియర్ సిటిజన్ పాల్.. కాళ్ల బేరానికి వచ్చాడు. ‘నేను తప్పు చేశాను.. నేనొక వృద్ధుడిని.. పైగా మానసికంగా పరిస్థితి సరిగ్గా లేదు.. నాకు బ్లడ్ కేన్సర్ కూడా ఉంది.. నన్ను ఇక్కడితో వదిలేయండి’ అంటూ ప్రాధేయపడడంతో రైల్వే అధికారులు ఈ ఎపిసోడ్‌ను ఇంతటితో పక్కన పెట్టాలని నిర్ణయించారు.