జాతీయ వార్తలు

లోక్‌సభలో రెండు ‘కార్మిక బిల్లులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: మరోసారి కార్మిక సంస్కరణలను తీసుకు రావాలని కోరుకుంటున్న ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. సులభతర వాణిజ్యాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఇప్పుడున్న 17 కార్మిక చట్టాలను కలపడానికి ఈ బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్ ఈ రెండు బిల్లులు- ‘కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ (ఓఎస్‌హెచ్) బిల్-2019’, ‘ద కోడ్ ఆన్ వేజెస్ బిల్- 2019’లను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ రెండు బిల్లులను పరిశీలించడానికి స్థారుూసంఘానికి పంపించాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఉన్న 13 కేంద్ర కార్మిక చట్టాలలోని అంశాలను కలిపి, సరళతరం చేసి, హేతుబద్ధీకరించడంతో పాటు కొన్ని నిర్దిష్టమయిన మార్పులు చేసి, ఒకే సంక్షిప్తమయిన చట్టంగా ఓఎస్‌హెచ్ కోడ్‌ను రూపొందించారు. గనులు, రేవులు మినహా పది మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది కార్మికులు ఉండే అన్ని ఎస్టాబ్లిష్‌మెంట్లకు ఈ కొత్త చట్టం వర్తిస్తుంది. సినీ, థియేటర్ కార్మికులకు కూడా ఈ కొత్త చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. వీరిని డిజిటల్ ఆడియో-విజువల్ వర్కర్ల జాబితాలో చేరుస్తుంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ మీడియా దీని పరిధిలోకి వస్తాయి. ఈ-పేపర్, రేడియో తదితర ఎలక్ట్రానిక్ మీడియాలోని జర్నలిస్టులు కూడా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు.